34.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

100వ ప్రయోగానికి సిద్ధం… కౌంట్ డౌన్ షురూ…

ఇస్రో మరో చరిత్ర సృష్టించించేందుకు సిద్ధమైంది. షార్ నుంచి ఈ నెల 29న ఉదయం 6:23 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది GSLV-F15 రాకెట్. ఇది ఇస్రోకు 100వ రాకెట్ ప్రయోగం. ఈసారి GSLV రాకెట్‌ను నింగిలోకి పంపనుంది ఇస్రో. ఇప్పటికే దీనికి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున ఈ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 27 గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగనుంది. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి బుధవారం ఉదయం 6:23 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది GSLV-F15.

GPSలాగా.. భారత్‌కు ప్రత్యకమైన నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది కేంద్రం. దీనికి సంబంధించిన శాటిలైట్లను నింగిలోకి పంపుతుంది ఇస్రో. ఇప్పుడు నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ల సిరీస్‌లో భాగంగా NVS-02 శాటిలైట్‌ను నింగిలోకి పంపనుంది.NVS -01ను 2023 మే 29న నింగిలోకి పంపారు. ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వస్తే మన దేశ నావిగేషన్ వ్యవస్థ మరింత మెరుగు కానుంది. మొత్తం 1500 కిలోమీటర్ల వరకు భారత భూభాగం వెలుపల కూడా మెరుగైన సమాచారం లభించనుంది. విమానాలు, నౌకా మార్గాలతో పాటు మన దేశ ఆర్మీ అవసరాలు కూడా తీరుతాయి.

ప్రస్తుతం ప్రయోగిస్తున్న రాకెట్ GSLV సిరీస్‌ో 17వది. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ కలిగిన 11వ రాకెట్. ఇస్రోకి ఇది 100వ ప్రయోగం. ఇప్పటి వరకు జరిపిన 99 ప్రయోగాల్లో 9 మాత్రమే ఫెయిలయ్యాయని చెప్పాలి. ఇప్పటి వరకు 129 స్వదేశీ.. 433 విదేశీఉపగ్రహాలు, రెండు ప్రైవేట్ ఉపగ్రహాలు ఒక గగన్‌యాన్ టెస్ట్ వెహికల్‌ డీవన్, 18 స్టూడెంట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com