స్వింగ్, పేస్, పర్‌ఫెక్షన్.. ఈ మూడింటికి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ జస్‌ప్రీత్ బుమ్రా. ఇప్పటికే తన బౌలింగ్‌తో ప్రత్యర్థి టీమ్‌కు కంగారు పుట్టించి.. వికెట్లు తీస్తూ టీమిండియా విక్టరీలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు బుమ్రా. అలాంటి బుమ్రాకు మరో కీలక అవార్డు అందించింది ఐసీసీ. 2024 సంవత్సరానికి గాను బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కట్టబెట్టింది. దీంతో బుమ్రా హిస్టరీలో ఓ కొత్త పేజీ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి.
గతేడాది బుమ్రా మొత్తం 13 టెస్ట్‌లు ఆడాడు. ఇందులో ఏకంగా 71 వికెట్లు తీశాడు. సిరీస్ ఏదైనా.. ఎక్కడైనా.. పిచ్ ఎలాంటిదైనా.. బుమ్రా వికెట్లు తీయడం మాత్రం ఆపలేదు. ఇందులో ఐదు సార్లు ఏకంగా ఐదు వికెట్లు తీశాడు బుమ్రా. ఒక్క బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరస్‌లోనే ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. అంతేకాదు ఈ అవార్డు అందుకున్న ఆరో టీమిండియా ప్లేయర్‌కాగా.. టీమిండియా పేస్ బౌలర్లలో బుమ్రాకు మాత్రమే ఈ అవార్డు దక్కింది.
ఇదే కాదు బుమ్రా పేరిట మరో రికార్డ్ కూడా ఇప్పటికే ఉంది. టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని దాటేసిన ఈ బౌలర్.. 20 కంటే తక్కువ బౌలింగ్ యావరేజ్‌తో ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ స్టైల్‌లో బుమ్రాను మించిన బౌలర్ ప్రపంచంలో ఎవరూ లేరు.
స్మృతి మంధానకు అవార్డు
స్మృతి మంధాన.. ఈ స్టార్ ప్లేయర్ గురించి తెలియని క్రికెట్ ఫ్యాన్ ఉండరు. ఉమెన్ టీమ్ ఓపెనర్ మంధానకు కూడా ఐసీసీ బెస్ట్ వన్డే ప్లేయర్ అవార్డు దక్కింది. 2024లో ఆమె 13 వన్డేలు ఆడగా.. అందులో 747 పరుగులు చేసింది. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.
అయితే ఈ అవార్డు మంధానకు దక్కడం రెండోసారి. 2018లో కూడా మంధాన బెస్ట్ వన్డే ప్లేయర్ అవార్డు అందుకుంద. అంతేకాఉ 2018, 2021ల ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌గా కూడా నిలిచింది.