26.1 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

RCB సరికొత్త చెత్త రికార్డ్..

RCB అంటేనే ఓ బ్రాండ్. ఒక ట్రోఫీ గెలవకపోయినా ఆ టీమ్‌కు ఉండే ఫ్యాన్ బేస్.. రికార్డులు అన్నీ ఇన్నీ కావు. కానీ RCB హిస్టరీలో కొన్ని చెత్త రికార్డులు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌లో లోయెస్ట్ స్కోర్‌తో పాటు.. ఇప్పుడు సరికొత్త చెత్త రికార్డు RCB హిస్టరీలో యాడ్ అయిపోయింది. అదేంటంటే హోమ్‌గ్రౌండ్‌లో ఎక్కువగా ఓడిన టీమ్‌గా నిలిచింది RCB.

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ దెబ్బకు ఓడింది RCB. 53 బంతుల్లోనే 93 పరుగులు చేసి బెంగళూరు ఓటమిని శాసించాడు రాహుల్. 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీకి నేనున్నానంటూ చెలరేగిపోయి ఆడాడు. ఈ ఓటమితో ఇప్పటి వరకు DC పేరుతో ఉన్న ఎక్కువగా ఉన్న ఓటముల రికార్డు RCBకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఇప్పటి వరకు చిన్నస్వామి స్టేడియంలో ఏకంగా 45 సార్లు ఓడింది. అంతకుముందు హోమ్‌గ్రౌండ్‌లో 44 సార్లు ఓడిన రికార్డు DC పేరుపై ఉండేది. అదే ఢిల్లీ టీమ్ బెంగళూరును ఓడించి తనపై ఉన్న చెత్త రికార్డును తొలగించుకుంది.

DC తర్వాత KKR-38, MI-34, PBKS-30 సార్లు సొంత గ్రౌండ్‌లో ఓడిపోయాయి. ఏదేమైనా ఎక్కువగా మద్దతు లభించే చిన్నస్వామి స్టేడియంలో RCB ఓడిపోవడాన్ని కొందరు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా కానీ తమ మద్ధతు మాత్రం RCBకే అంటూ చెబుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com