చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతికి గాయమైంది. దీంతో అతను మొత్తం సీజన్ నుంచి దూరంగా జరిగాడు. మరి నెక్ట్స్ టీమ్ కెప్టెన్ ఎవరు? అనగానే మేనేజ్‌మెంట్ చూపు మళ్లీ తలావైపు పడింది. దానికి ధోని అంగీకరించడం.. ఇక నెక్ట్స్ మ్యాచ్‌లన్నింటికి ధోనినే కెప్టెన్‌గా వ్యవహరించడం కన్ఫామ్ అయిపోయింది.
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ పగ్గాలు చేపడుతున్న టైమ్ హైలేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన CSK.. తొలి మ్యాచ్‌లో గెలిచి.. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడింది. ప్రస్తుతం CSK పీకల్లోతూ కష్టాల్లో ఉందని చెప్పాలి. అలాంటి టైమ్‌లో ధోని ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ నిజంగా రుత్‌రాజ్ గాయపడ్డాడా? లేక కావాలనే ఈ అనౌన్స్‌మెంట్ ఇచ్చి అతడిని పక్కన పెట్టారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రుత్‌రాజ్ సారథ్యంలో టీమ్ వరుసగా ఫెయిలవుతోంది. అదే సమయంలో రుత్‌రాజ్ కూడా ఇప్పటి వరకు పెద్దగా ఆడిన ఇన్నింగ్స్‌లు ఏమీ లేవు. అందుకే CSK మేనేజ్‌మెంట్‌పై అనుమానాలు పెరుగుతున్నాయి.
గతంలో కూడా రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇచ్చింది CSK మేనేజ్‌మెంట్. అప్పుడు కూడా వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతుందని చెప్పి అతడిని తప్పించి మళ్లీ ధోనినే కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు. ఈసారి కూడా అలానే జరిగితే విమర్శలు వస్తాయని చెప్పి.. గాయం కారణాన్ని చూపుతున్నారా? అనే అనుమానాలు లేకపోలేదు.
ఇక ధోని విషయానికి వస్తే.. గతంలోలాగా మ్యాచ్‌లను ఒంటి చెత్తో గెలిపించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కొద్ది సేపు క్రీజులో ఉండటం.. ఓ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదడం.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడం వెళ్లిపోవడం జరుగుతుంది. అయితే ధోని ఫ్యాన్స్ ఇక్కడ కొందరు అతి చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. రుత్‌రాజ్‌కు సరైన సమయంలో గాయమైంది. ఇది CSKకు మంచిదే అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి తలా తర్వాత జరిగే మ్యాచ్‌ల్లో గెలిచి వీరందరిని సాటిస్‌ఫై చేయగలరా? లేదా? అనేది చూడాలి.