రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ సైనికులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. చాలా తెలివైన స్టేట్‌మెంట్ ఇచ్చారు పుతిన్. ఈ స్టేట్‌మెంట్‌కు ముందు ఓ కీలక ఘటన జరిగింది. యుద్దం వేళ ఉక్రెయిన్ సైనికుల విషయంలో కనికారం చూపించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలను తాను పరిగణలోకి తీసుకున్నానని.. అందుకే ఉక్రెయిన్ సైనికులు వెంటనే ఆయుధాలను విడిచి పెట్టి.. లొంగిపోతే వారి ప్రాణాలను కాపాడగలను.. రష్యా ఫెడరేషన్‌తో పాటు.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని పుతిన్ తెలిపారు. ముఖ్యంగా కర్క్స్ లో ఉన్న ఉక్రెయిన్ సైనికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొంత భాగాన్ని కీవ్ సేనలు ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక్కడి సైనికులు తమ పౌరులపై దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ట్రంప్.
ప్రస్తుతం ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది రష్యా. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందే ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని ఆ తర్వాత ఒప్పందం అమలు చేసే ఆలోచనలో ఉంది రష్యా. అందుకే పుతిన్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తునట్టు అర్థమవుతోంది.