26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

రూ.30 కోట్ల ఆదాయం అన్నాడు… రూ.12.8 కోట్లుకి ఐటీ నోటీసులు…

మహాకుంభమేళాలో బోట్లు నడిపి రూ.30 కోట్లు సంపాదించారంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సీఎం యోగి ఆదిత్యానాథ్‌ చేసిన ప్రకటన.. ఇప్పుడు ఓ కుటుంబాన్ని ఇబ్బందులోకి నెట్టింది. పింటూ మహ్రా కుటుంబం త్రివేణి సంగమం వద్ద బోట్లు నడిపి.. 30 కోట్లు సంపాదించారని తెలిపారు. దీనిని పింటూ కుటుంబం కూడా ధ్రువీకరించింది. వీరి కుటుంబంలోని వంద మందికిపైగా వ్యక్తులు 45 రోజుల పాటు 130 బోట్లు నడిపారు. ఇప్పుడు ఇన్‌కమ్‌ ట్యాక్స్ 1961 ప్రకారం రూ.12.8 కోట్ల పన్ను చెల్లించాలంటూ వారికి నోటీసులు పంపింది.

1961 ఐటీ చట్టంలోని సెక్షన్ 4, 68 కింద నోటీసులు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై భిన్న స్పందనలు వస్తున్నాయి. డబ్బు సంపాదించినా ఈ కుటుంబానికి ఇదో పీడకల అయ్యిందని కొందరు.. ఫైనాన్షియల్ డిసిప్లేన్ లేదని మరికొందరు.. ఇలా రకరకాలుగా తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే పింటూ కుటుంబం మాత్రమే డబ్బు సంపాదించలేదని.. అతని కుటుంబం మొత్తం సంపాదించిందని.. మొత్తం వంద మంది వ్యక్తులు కష్టపడితే.. కేవలం పింటూకు నోటీసులు పంపడం ఏంటన్న ప్రశ్నలు కూడా మొదలయ్యాయి.

మహా కుంభమేళా సమయంలో ఒక్కో బోటుపై రోజుకు 50 వేల నుంచి 52 వేల వరకు సంపాదించారు బోట్లు నడిపేవారు. ఒక్కో బోటుపై రూ.23 లక్షల వరకు సంపాదించారు బోట్లు నడిపేవారు. మొత్తానికైతే ఈ నోటీసులతో ఇప్పుడు కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com