35.1 C
Hyderabad
Friday, June 19, 2026

Live Video

spot_img

పుష్ప 2’ రీలోడెడ్‌ వెర్షన్‌.. వాయిదా

కొన్ని అదనపు సన్నివేశాలతో కూడిన ‘పుష్ప 2’ రీలోడెడ్‌ వెర్షన్‌ను వాయిదా వేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. సంబంధిత కంటెంట్‌ విషయంలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతోందని తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ నెల 17 నుంచి కొత్త సన్నివేశాలతో కూడిన సినిమాని చూడొచ్చని పేర్కొంది. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న చిత్రానికి అదనంగా 20 నిమిషాల నిడివి గల సన్నివేశాలను జోడిస్తున్నామని, ఈ నెల 11 నుంచి చూడొచ్చని మంగళవారం ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ‘పుష్ప 2’ నిడివి 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు ఉండగా.. దానికి ఇంకా 20 నిమిషాల సీన్స్‌ యాడ్‌ చేస్తే, 3 గంటల 40 నిమిషాలు దాటిపోతుంది. అంటే ఇంటర్వెల్‌తో కలిపి దాదాపు 4 గంటల పాటు ‘పుష్ప’ ప్రపంచంలో ప్రేక్షకుడు ఉంటాడు. మరోవైపు, ఈ చిత్రం ఇప్పటికే సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో, తెలుగు సినిమాల లిస్ట్‌లో ప్రథమ స్థానంలోకి వచ్చింది. ‘దంగల్’ (రూ. 2 వేల కోట్లకుపైగా) తర్వాత ఇప్పటి వరకూ రెండో ప్లేస్‌లో ఉన్న ‘బాహుబలి 2’ (రూ.1810 కోట్లు)ను రికార్డును బ్రేక్‌ చేసింది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్‌) రాబట్టింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com