26.7 C
Hyderabad
Wednesday, April 29, 2026

Live Video

spot_img

హిందీ లో దూసుకుపోతున్న పుష్ప..

నాలుగు రోజుల్లోనే 800 కోట్ల వసూళ్లు

నేషనల్ అవార్డు గ్రహీత అల్లూ అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది.ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్ లో పుష్ప కలెక్షన్లు నాలుగు రోజుల్లోనే రూ. 800 కోట్లు చేరుకున్నాయి. తొలివారం పూర్తయ్యే సరికి  ఈ కలెక్షన్ ఈజీగా వెయ్యికోట్లు దాటేస్తుందని అంచనాలున్నాయి. పుష్ప సీక్వెల్ ప్రత్యేకించి హిందీ మాట్లాడే నార్త్ లో సునామీ స్రుష్టిస్తోంది.  తెలుగు వర్షన్ కన్నా హిందీ వెర్షన్ లో 80 కోట్ల నెట్ వర్త్ ను దాటేసిన తొలి సినిమా పుష్ప 2.నిన్న ఒక్కరోజులోనే ఈ సినిమా రూ. 141 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టుకుంది.  కాగా తెలుగు వెర్షన్ రూ.44 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.తమిళనాడులో నిన్న ఒక్క రోజు రూ.9 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

మలయాళం, కన్నడ వెర్షన్లు వరుసగా రూ.1.9 రూ.1.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టాయి. దక్షిణాది రాష్ట్రాల నెట్ కలెక్షన్ దాదాపు రూ.529 కోట్లు కాగా హీందీ వెర్షన్ కలెక్షన్లు దీనిని మించి దూసుకుపోయాయి. నాలుగు రోజుల్లో ఈ కలెక్షన్లు రూ.285 కోట్ల నెట్ కు చేరుకున్నాయి. బన్నీ,సుకుమార్  కాంబినేషన్ సినిమా ఇండస్ట్రీలో సాధించిన ఈ సునామీ సక్సెస్ పట్ల అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com