25 C
Hyderabad
Wednesday, October 7, 2026

Live Video

spot_img

సోనియా, సోరోస్ మధ్య లింకులేంటి?

అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపి కౌంటర్

అమెరికాలో కేసులు ఎదుర్కొంటున్న అదానీకి ప్రధాని మోడీకి మధ్య లింకులున్నాయంటూ విపక్షాలు పార్లమెంటును స్తంభింప చేస్తున్న నేపధ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పై కౌంటర్లు సంధించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, హంగేరియన్ అమెరికన్ బిజినెస్ మెన్ జార్జి సోరోస్ కు మధ్య సంబంధాలున్నాయన్న వార్తలపై సీరియస్ గా ద్రుష్టి పెట్టాలని ఎన్డీఏ కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. ఈ కామెంట్లను పొలిటికల్ యాంగిల్ లో చూసి తేలికగా కొట్టి పారేయద్దని దేశ భధ్రతపైనా, పరువు ప్రతిష్టలపైనా యునైటెడ్ ఫ్రంట్ నేతలు ఆలోచించాలని దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరులో కలసి రావాలని అన్నారు. జార్జి సోరోస్ నిధులతో నడుస్తున్న సంస్థలతో సోనియాకు లింకులు ఎందుకు ఉన్నాయో వివరణ ఇవ్వాలన్నారు.సోరోస్ నిధులతో నడిచే సంస్థలన్నీ మన దేశంలో వివాదాస్పద అంశాలపై పదే పదే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాయని తప్పుడు కథనాలు స్రుష్టిస్తున్నాయన్నారు. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాగా అది ప్రత్యేక ప్రాంతమని వాదిస్తూ వచ్చారన్నారు. డెమోక్రటిక్ ఆసియా ఫసిఫిక్ లీడర్స్ ఫౌండేషన్ సహ అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరిస్తున్న విషయాన్ని రిజుజు ప్రస్తావించారు. ఈ సంస్జలన్నీ సోరొస్ ఫండింగ్ సంస్థలే. సోరోస్ సంస్జతో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు లింకులుండటం మన దేశ అంతర్గతవ్యవహారాల్లో విదేశీ శక్తుల ప్రమేయం ఉందనడానికి నిదర్శనమన్నారు. పార్లమెంటును మేం నడపాలనుకుంటున్నాం. కానీ కొన్ని అంశాలు రాజకీయ ప్రేరేపితమైనవైతే మన అంతరంగిక వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యం రాజకీయ ప్రమేయంతో కూడుకున్నదని అది దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చూరుకు ఊరుకోబోమని అన్నారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని కానీ రాహుల్ గాంధీ నాయకత్వ సమర్ధతపై ఇండియా కూటమి లోనే సందేహాలున్నాయన్నారు.

తిప్పి కొట్టిన కాంగ్రెస్

బీజేపి ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కార్తీ బీజేపి వ్యాఖ్యలను డార్క్ ఫాంటసీలుగా అభివర్ణించారు. ఇవి డార్క్ వెబ్ సంబంధిత ఆరోపణలుగా పరిగణించాలని, ఇలాంటి కుట్ర పూరిత కథనాలకు విలువేలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలంతా దేశ భక్తులేనని, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర తమ పార్టీదనీ దేశ ఐక్యతకు విఘాతం కలిగించే ఏ చర్యనూ తాము సమర్ధించమని అన్నారు. బీజేపికీ ఇలాంటి ఆరోపణలు చేయడం కొత్త కాదని వాటిని సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సమాజ్ వాదీ పార్టీ కామెంట్ చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com