24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

పుష్ప2 సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టు

పుష్ప2 సినిమా తొక్కిసలాట వ్యవహారంలో సినీ హీరో అల్లు అర్జున్ ను హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్టు చేసిన పోలీసులు సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్‌ను పోలీసు కమిషనర్ CV ఆనంద్ ధృవీకరించారు

సినిమా విడుదల రోజు  అల్లు అర్జున్ పుష్పా -2 సినిమా చూసేందుకు రాగా… అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. అల్లు అర్జున్ వచ్చే సమయంలో థియేటర్ యాజమన్యం తగిన చర్చల తీసుకోలేదని వారి కేసు నమోదైంది. థియేటర్ కు వచ్చే ఆంశం ఆలస్యంగా పోలీసులకు తెలిపినందుకు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది.

అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు.. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు.. 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుల్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం.. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

మరోవైపు బన్నీని రిమాండ్ కు పంపిస్తారని వార్తలు రావడంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్న అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్… సోదరుడు అల్లు శిరీష్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి.

అయితే సోషల్ మీడియాలో తెలంగాణ పోలీసులు సూపర్ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com