28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

అల్లు అర్జున్ కు రిమాండ్…?

పుష్ఫ2 హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. సినిమాలో హీరోయిజంతో ఆకట్టుకున్న బన్నీకి నిజజీవితంలో చేదు అనుభవం ఎదురు కానుందా అనే అనుమానం అభిమానుల్లో పట్టుకుంది.

అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు.. 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుట్‌ కేసు కాగా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఉదయం హుషారుగా స్టేషన్ కు వెళ్లిన బన్నీని రిమాండ్ కు పంపనున్నారని వార్తలు రావడంతో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్… సోదరుడు అల్లు శిరీష్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

ఈ రోజు(శుక్రవారం) అరెస్టు చేయటం అంటూ జరిగితే రెండో శనివారం, ఆదివారం న్యాయస్థానానికి సెలవు. రెండు రోజుల పాటు జైలులో ఉండాల్సి వస్తుందా. న్యాయమూర్తి అనుమతితో వ్యక్తిగతంగా హాజరుపరిచి బెయిల్ ఇస్తారా వేచి చూడాలి.

అయితే ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని రిామండ్ కు పంపారు. బన్నీకి ఉన్న క్రేజ్ కు బెయిల్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఏ2 గా ఉన్న అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాకపోవచ్చని… ఇవ్వటం జరిగితే విమర్శలు వచ్చే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com