26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

అదరగొట్టిన పంజాబ్.. పోరాడి ఓడిన గుజరాత్..

ఈసారి ఐపీఎల్‌లో ఎవరూ తగ్గేదేలే అంటున్నారు. అన్ని మ్యాచ్‌లు కూడా వార్ వన్‌సైడే అన్నట్టుగా కాకుండా నువ్వా-నేనా అన్నట్టుగా ఆఖరి వరకు ఉత్కంఠను రేపుతున్నాయి. పంజాబ్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ కూడా దీనికి ఉదాహారణే. ఈ మ్యాచ్‌లో కూడా పరుగుల వరద పారింది. కానీ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పోరాడి ఓడింది GT, బోణి కొట్టింది పంజాబ్ కింగ్స్.

మరో హైస్కోర్ మ్యాచ్‌కు అహ్మాదాబాద్ వేదికైంది. పంజాబ్ ఏకంగా 244 పరుగుల భారీ టార్గెట్‌ను గుజరాత్ ముందు ఉంచగా.. కేవలం 11 పరుగుల తేడాతో ఓడింది ఆ టీమ్.

ఈ మ్యాచ్‌లో శ్రేయస్, శశాంక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. శ్రేయస్ అయ్యర్ 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 42 బంతుల్లో ఏకంగా 97 పరుగులు బాదాడు. జస్ట్‌లో సెంచరీ మిస్ అయినా టీమ్ విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడనే చెప్పాలి. ఇక ఎప్పటిలాగానే శశాంక్ సింగ్ మళ్లీ రెచ్చిపోయాడు 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు ఆఖరి ఓవర్‌లోనే బాదడం మరో హైలేట్. వీరిద్దరి కంటే ముంద ప్రియాన్ష్‌ చేసిన 47 పరుగులు కూడా పంజాబ్‌కు బాగానే కలిసొచ్చాయి. మొత్తంగా చూసుకుంటే 5 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది పంజాబ్. ఈ సందర్భంగా అర్షద్ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ బౌలర్ ఒక ఓవర్ వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. సిరాజ్ ఏమాత్రం మ్యాజిక్ చేయకపోగా.. సాయి కిషోర్ మాత్రం ఏకంగా మూడు వికెట్లు తన అకౌంట్‌లో వేసుకున్నాడు.

నిజానికి భారీ టార్గెట్‌ను ఛేజ్ చేయడంలో దాదాపుగా సక్సెస్ అయ్యారు GT ప్లేయర్స్. ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా తానేం తక్కువ కాదన్నట్టు వీర విహారం చేశాడు. ఏకంగా ఆరు సిక్స్‌లు బాది.. 41 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. ఇక గిల్ 33 పరుగులతో పర్వాలేదనిపించాడు. బట్లర్ మాత్రం 54 పరుగులతో చెలరేగాడు. అతను ఇంకొద్ది సేపు క్రీజులో ఉండి ఉంటే గుజరాత్ కథ వేరేలా ఉండేది కావొచ్చు. కానీ జన్‌సేన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేయడంతో గుజరాత్‌పై ఒత్తిడి పెరిగింది. రూథర్ ఫర్డ్‌ కూడా 46 పరుగులతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 232 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com