26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

శ్రీశైలంలో తగ్గుతున్న నీటి నిల్వలు

శ్రీశైలం జలాశయంలో జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో అటు విద్యుత్‌ ఉత్పత్తికి, సాగు నీటి అవసరాలకు నీటి లభ్యత కష్టతరమయ్యే పరిస్ధితి తలెత్తుతోంది. బుధవారం ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీశైలం జలాశయంలో 48.9065 టీఎంసీల నీటి నిల్వలు నమోదు అయ్యాయి. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్ధ్యం 21.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యాములో నీటి నిల్వలు కేవలం 48.9065 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్ట 829.4 అడుగులు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల నుంచి తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి 35వేల 315 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి 35315 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగించారు. దీంతో ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 829.4 అడుగుల నీటిమట్టం నమోదయింది. అలాగే ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 215. 8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 51. 0184 టీఎంసీల నీటి నిల్వలు నమోదు అయ్యాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com