- మొన్న పాలస్తీనా.. నిన్న బంగ్లాదేశ్ నినాదాల బ్యాగులు
- హిందూ మనోభావాలను దెబ్బతీస్తోందన్న బీజేపి
- నా వేష , భాషలపై మీ నియంత్రణ ఏంటి? అన్న ప్రియాంక
వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ రెండురోజులుగా పార్లమెంటులో హల్చల్ చేస్తున్నారు.. రోజుకొక బ్యాగ్ వెంట తీసుకొస్తూ ప్రపంచ సమస్యల ను , వాటి పరిష్కారానికి మోడీ ప్రభుత్వం చేయాల్సిన పనులను సూచించే బ్యాగులవి. నిన్న ప్రియాంక పార్లమెంటుకు పాలస్తీనా బ్యాగ్ ను తగిలించుకుని వచ్చారు. దాని మీద పాలస్తీనా నినాదంతో పాటు పక్కన సౌభ్రాత్రుత్వానికి ప్రతీక అయిన వాటర్ మిలన్ గుర్తు కూడా ఆ బ్యాగ్ పై ఉంది. నిన్న ప్రియాంక బ్యాగ్ లోక్ సభలో చర్చనీయాంశమైంది. పాలస్తీనా మైనారిటీలకు మద్దతు తెలపాలన్న సంకేతాలు ఆమె ఇచ్చినట్లయింది. ఇవాళ ఆమె బంగ్లాదేశ్ నినాదాలతో కూడిన బ్యాగును తీసుకొచ్చారు. గత రెండు రోజులుగా ఈ అంశం లోక్ సభలో చర్చనీయాంశమయింది. ప్రియాంక పోకడలు నచ్చాయేమో.. ఇతర మహిళా ఎంపీలు కూడా అవే బ్యాగులతో ఇవాళ పార్లమెంటులో ప్రత్యక్షమయ్యారు.బంగ్లాదేశ్ లో అణచివేతలకు, దాడులకు బలవుతున్న హిందువులు, క్రిస్టియన్లు , ఇతర మైనారిటీల కోసం భారత్ పోరాడాలని, ఆ దేశంతో దౌత్యపరమైన సంబంధాలు నెరపి ఈ సమస్యను పరిష్కరించాలని, శరణార్ధులను ఆదుకోవాలని ప్రియాంక జీరో అవర్ లో ప్రభుత్వానికి సూచన చేశారు.
అది కాంగ్రెస్ భావజాలానికి నిదర్శనం: బీజేపి
అయితే ప్రియాంక విధానాలను బీజేపి తప్పు బట్టింది. సభకు ఏం చెప్పదలచుకున్నారామె.. ఇది భారత ప్రతినిధుల సభ.. 120 మంది కోట్ల కు ప్రతినిధులుగా ఎంపీలు నిలబడాలి. బంగ్లాదేశ్ హిందువులకు ఆమె ఎప్పుడైన సంఘీభావం తెలిపారా? బ్యాగులపై ఉన్న నినాదాలు ఆమె వ్యాఖ్యలుగా పరిగణించాలా అని బీజేపి ఐటీ సెల్ అధినేత అమిత్ మాలవీయ మండి పడ్డారు.
నేనేం కట్టుకోవాలో వారు నిర్ణయిస్తారా? … ప్రియాంక మండిపాటు
ఇదే అంశాన్ని ప్రియాంక ద్రుష్టికి తెస్తే ఆమె ఘాటుగా రియాక్టయ్యారు. మేం ఏ దుస్తులు వేసుకోవాలో వాళ్లెవరు డిసైడ్ చేయడానికి. ఇది పూర్తిగా నా వ్యక్తిగత స్వేచ్ఛ. ఆడవాళ్లు ఏం దుస్తులుధరించాలో మగవాళ్లు చెబుతారా? ఇది పిత్రుస్వామిక వ్యవస్థ అనడానికి ఇంత కన్నా నిదర్శనం కావాలా అని మండిపడ్డారు. నా ఆలోచనలు, విధానాలు, అభిప్రాయాలు ఈ అంశాలపై గతంలోనే ట్విట్టర్ లో వెల్లడించాను అన్నారు ప్రియాంక. ప్రియాంక ఇంటికి పాలస్తీనా ఎంబసీ ప్రతినిధి ఒకరు రెండు రోజుల క్రితం రావడం కూడా రాజకీయ దుమారాన్ని రేపింది.
కాంగ్రెస్ విధానాలేంటో ప్రియాంక తీరుతో వెల్లడైయ్యాయంటున్న బీజేపి ఈ సెషన్స్ చివరి రోజున సభ మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానంపై రెండు నిమిషాలు మౌనం పాటించాలని మాలవీయ కామెంట్ చేశారు. పాలస్తీనాను సమర్ధిస్తూన్న నినాదాలతో కూడిన బ్యాగ్ ను పార్లమెంటులో ప్రదర్శించడం అంటే మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టడమేనని బీజేపి విమర్శించింది.