23.7 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

పారిశ్రామిక పార్కుల్లో దళిత,గిరిజనులకు ప్రాధాన్యత – మంత్రి శ్రీధర్ బాబు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘మినీ ఇండస్ట్రియల్ పార్క్’ను మహిళల కోసం అభివృద్ధి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామన్నారు. హైదరాబాద్, లక్డీకాపూల్ రెడ్ హిల్స్ లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ టీసీసీఐ) భవన్ లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ ప్రైజెస్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన “రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎంఎస్ఎంఈ(ఎంఎస్ఎంఈ) 2024: ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ” కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్పీచ్ పాయింట్స్….

ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది. చేవెళ్ల డిక్లరేషన్ లో దళితులకిచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కచ్చితంగా నెరవేరుస్తుంది. కాంగ్రెస్ అంటేనే దళితులు.. దళితులు అంటేనే కాంగ్రెస్. దళితుల అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.
ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే.. మరోవైపు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాం. 2017 నుంచి సబ్సిడీల కింద పారిశ్రామికవేత్తలకు అందాల్సిన బకాయిలు రూ.4500 కోట్లకు పైగా ఉన్నాయి. వీటిలో రూ.2200 కోట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకే రావాలి. మేం అధికారంలోకి రాగానే ఈ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించాం. వచ్చే నెల(మార్చి) చివరి నాటికి రూ.300 కోట్లు చెల్లిస్తాం.
దేశంలో ఎక్కువ మంది కార్మికులు ఎంఎస్ఎంఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. కానీ.. దురదృష్టవశాత్తు ఇప్పటీ వరకూ ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా పాలసీ అంటూ ఏదీ లేదు. రాహుల్ గాంధీ సూచనల మేరకు మేం ప్రత్యేకంగా పాలసీని తీసుకొచ్చాం. క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. నిపుణులను భాగస్వామ్యం చేసి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ పాలసీని రూపొందించాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోరిక మేరకు.. వారికి మరింత ప్రయోజనం చేకూరేలా ఈ పాలసీ ఆపరేషనల్ గైడ్ లైన్స్ ను తయారు చేస్తాం.
ప్రొక్యూర్ మెంట్, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తాం. శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రత్యేక పాలసీలను తీసుకొస్తాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం. పరిశ్రమల స్థాపనంలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తాం. స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులను అందిస్తాం. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది.
బ్యాంక్ ల నుంచి రుణాలు పొందటంలో ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తాం. కుటీర పరిశ్రమలకు అండగా నిలుస్తాం. వాటిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం.
ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తమిళనాడు, కర్ణాటకలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. ఆయా ప్రభుత్వాలు దళిత పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహాకాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com