- మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ లకు ప్రధాని రాక
- ముంబైలో వేవ్స్ సదస్సు ప్రారంభోత్సవం
- కేరళలో మల్టీ పర్పస్ డీప్ వాటర్ సీ పోర్టు జాతికి అంకితం
- 2న మధ్యాహ్నం 3.30కి అమరావతికి
- అమరావతిలో 58 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శ్రీకారం
- అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ
- ముంబై వేవ్స్ సదస్సు ఇన్నోవేటివ్ క్రియేటివ్ రంగంలో ముందంజ
ప్రధాని మోడీ మే 1,2 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించి పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మే ఒకటిన ఉదయం 10.30కి ముంబై చేరుకునే ప్రధాని అక్కడ ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్ మెంట్ సదస్సును ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి 2వ తేదీన ఉదయం 10.30 కేరళ చేరుకుని విఝింజామ్ అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టిపర్పస్ సీ పోర్టును జాతికి అంకితం చేస్తారు.ఈసందర్భంగా ఆహూతులనుద్దేశించి ప్రసంగిస్తారు.
అమరావతికి ప్రధాని…
అనంతరం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ చేరుకుని అమరావతి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేస్తారు. దాదాపు రూ.58 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
వేవ్స్ స్పెషాలిటీ ఇదే…
మహారాష్ట్రలోని ముంబైలో ప్రధాని ప్రారంభించనున్న వేవ్స్ 2025కి అనేక ప్రత్యేకతలున్నాయి.ఇది మన దేశంలోనే తొలి ప్రపంచ ఆడియో, విజువల్, ఎంటర్టైన్ మెంట్ సదస్సు.. దీనిని ముంబైలోని జియో వాల్డ్ సెంటర్ లో ప్రారంభిస్తున్నారు. కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్ అనే ట్యాగ్ లైన్ తో నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ఎంటర్ టైన్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ రంగంలో భారత్ ను ఒక గ్లోబల్ హబ్ గా నిలబెడుతుందని అంచనాలున్నాయి. ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లు, స్టార్టప్స్, పారిశ్రామిక నేతలు, పాలసీ మేకర్లను అను సంధానిస్తుంది. వేవ్స్ సంస్థ సినిమాలు, ఓటీటీ, గేమింగ్, కామిక్స్, డిజిటల్ మీడియా, ఏఐ, ఏవీజీసీ, ఎక్స్ ఆర్ బ్రాడ్ కాస్టింగ్,ఆధునిక సాంకేతికతను ఒక చోట చేర్చి భారతీయ మీడియాను, ఎంటర్ టైన్ మెంట్ మీడియాను శక్తివంతంగా చేస్తుందన్న అంచనాలున్నాయి. 2029 నాటికి ఈ వేవ్స్ సంస్థ 50 బిలియన్ డాలర్ల మార్కెట్ ను సృష్టిస్తుందన్న అంచనాలున్నాయి. గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ ఎకానమీలో భారత్ అవకాశాలను మరింత విస్తరించనుంది.
భారత్ తొలిసారి గ్లోబల్ మీడియా చర్చను ప్రారంభిస్తోంది. 25 దేశాల మంత్రులు ఈ చర్చాగోష్టిలో పాల్గొంటున్నారు. వేవ్స్ బజార్ పేరుతో ప్రపంచ ఈ- మార్కెట్ ను నెలకొల్పనుంది. దాదాపు 6,100 మంది కొనుగోలు దార్లు,5,200 మంది అమ్మకం దార్లు, 2,100 ప్రాజెక్టులు వేవ్స్ చర్చల ద్వారా పుట్టుకొస్తాయన్నది అంచనా. ఇది నిర్మాతలు, దర్శకులను స్థానికంగా, ప్రపంచ వ్యాప్తంగా కనెక్ట్ చేసే ఒక ప్రయత్నం. ఇది నెట్ వర్కింగ్ ను, వ్యాపార అకాశాలను మరింత విస్తృతం చేస్తుంది.గతేడాది ఎంపిక చేసిన 32 మంది క్రియేటర్లతో కూడిన క్రియేటో స్ఫియర్ను సందర్శించి వారితో ప్రధాని సమావేశమవుతారు.దీనిలో ఇప్పటికే లక్ష మంది సభ్యత్వాలను నమోదు చేసుకున్నారు. వేవ్స్ సదస్సులో 90 దేశాలు పాల్గొంటున్నాయి.10 వేలమందికి పైగానే డెలిగేట్లు హాజరవుతారని అంచనా.వెయ్యి మంది క్రియేటర్లు, 300కు పైగా కంపెనీలు, 350 అంకుర సంస్థలు పాల్గొంటున్నాయి.ఇందులో 42 ప్లీనరీ సెషన్స్, 39 బ్రేక్ అవుట్ సెషన్స్, 32 మాస్టర్ క్లాసెస్ జరుగుతాయి.