కంచి కామకోటి పీఠానికి నూతన పీఠాధిపతిని ఎంపిక చేశారు. కంచి పీఠం71 వ పీఠాధిపతిగా అభిషేకం అయిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రమణ్య గణేష్ శర్మ ద్రవిడ్ కు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య నామకరణం చేశారు. సత్య చంద్ర శేఖరేంద్ర సరస్వతి అని నామకరణం చేశారు.
బుధవారం ఉదయం, అక్షయ తృతీయ సందర్భంగా సంప్రదాయబద్ధంగా జరిగిన సన్యాస దీక్షను సత్య వేంకట గణేష్ సుబ్రమణ్య శర్మకు శ్రీ విజయేంద్ర సరస్వతి దీక్ష నిచ్చారు.
ఆది శంకరాచార్యులు ప్రబోధించిన అద్వైత మతానికి ఏర్పడిన పీఠాల్లో తమిళనాడులోని కంచి కామకోటి పీఠం ఒకటి.
71 వ కంచి పీఠం స్వామిగా నియమితులైన గణేశ శర్మ ద్రవిడ్ ఆధ్యాత్మిక కుటుంబానికి చెందినవారు.
ఆయన తండ్రి దన్వంతరి అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రధాన పూజారి.
వారు 2006లో వేద విద్య ప్రారంభించి ఋగ్వేదంతో పాటు యజుర్వేదం, సామవేదం, దశోపనిషత్తులపై లోతైన అధ్యయనం చేశారు.
శ్రీ కంచి పీఠం శంకరాచార్యుల ఆశీస్సులతో విద్యాభ్యాసం కొనసాగించారు.
ఉత్తరాధికారి అభిషేకం, జగద్గురు ఆది శంకరాచార్యుల 2,534వ జయంతి సందర్భంలో జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వేదాలను వైదిక శాస్త్రాలను ఔపాసన పట్టిన వారిని అనేక వడపోతల ద్వారా, పీఠాధిపతి నిర్ణయానుసారం ఉత్తరాధికారిగా ఎంపిక చేస్తారు.
పీఠాధిపతి మహానిర్యాణానంతరం ఉత్తరాధికారి కంచి స్వామి (పీఠాధిపతి) అవుతారు. ఇది పరంపరగా వస్తోంది.
ఇపుడు పీఠాధిపతిగా వున్న శంకర విజయేంద్ర సరస్వతి ఈ పరంపరలో 70 వ స్వామి.
68 వ స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి (ఇదే పేరుతో అప్పటికి ఏడుగురు కంచిపీఠం అధిపతులుగా వున్నారు) సుదీర్ఘకాలం 1907 నుంచి 94 వరకూ కంచి పీఠాధీశులుగా వున్నారు.
చంద్రశేఖరేంద్ర సరస్వతి అనంతరం కంచి పీఠం బాద్యతలు చేపట్టిన 69 వ స్వామి జయేంద్ర సరస్వతి 1994 నుంచి 2018 మధ్యలో వైద్య వసతుల ద్వారా, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వారి తర్వాత 70 వ స్వామిగా (అప్పటి ఉత్తరాధికారి) శంకర విజయేంద్ర సరస్వతి 2018 నుంచి పీఠాధీశులుగా వున్నారు.