- విషాదంగా మారిన సింహాచలం చందనోత్సవం
- భారీ వర్షానికే కుప్పకూలిన ఆలయ గోడ
- రూ.300 టిక్కెట్ల క్యూలైన్ పై కూలిన గోడ
- ఏడుగురు భక్తుల దుర్మరణం.. కొందరికి గాయాలు
- వారం రోజుల క్రితమే నిర్మించిన గోడ
- నాణ్యతా లోపమే కారణమంటున్న అధికారులు
- ఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం
- ఇదిప్రభుత్వ వైఫల్యమని విపక్షాల ఆరోపణ
- బాధిత కుటుంబాలకు జగన్ పరామర్శ
సింహాచల పుణ్యక్షేత్ర పరిసరాల్లో ఘోర దుర్ఘటన జరిగింది. చందనోత్సవం దర్శనానికి వచ్చిన ఎనిమిది మంది భక్తులు ఈప్రమాదంలో మరణించారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ,స్పెషల్ క్యూలైన్ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు తీసింది. ఈ ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి.
బుధవారం ఉదయం నుంచే సింహాచలం పరిసరాల్లో భీకర గాలులతో వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దీంతో రూ. 300 టిక్కెట్ల క్యూలైన్ పై గోడకూడలి ఏడుగురు భక్తులు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ , ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
చందనోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తారన్న ఉద్దేశంతో ఆలయాధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే మంగళవారం సాయంత్రం నుంచి విశాఖ పరిసరాల్లో వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులు, వర్షం మొదలైంది. ఈ వర్షానికి ఆలయంలో కొత్తగా నిర్మించిన గోడ నానిపోయింది. ఉదయం భక్తులు క్యూ లైన్ లో ఉండగానే నానిపోయిన గోడ కూలిపోయి పడిపోయింది.
పది రోజుల క్రితం నిర్మాణం
వాస్తవానికి పదిరోజుల క్రితమే ఈ గోడను నిర్మించారు. అదే కూలిపోవడంతో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. దీనికోసం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా వేశారు. ఘటనా స్థలిని మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు పరిశీలించారు.
విశాఖకు వైఎస్ జగన్
సింహాచలంలో గోడకూలి ఏడుగురు మరణించిన ఘటనను పరిశీలించడానికి వైసీపీ అధినేత జగన్ సింహాచలం చేరుకున్నారు.క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను పలకరించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని జగన్ ఆరోపించారు. అసలు వారంరోజుల క్రితం గోడ కట్టడం, అది వెంటనే కూలిపోవడం చూస్తుంటే నాణ్యతా లోపాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్ధమవుతోందని వైసీపీ నేతలు వై.వి.సుబ్బార్డెడి, లక్ష్మీ పార్వతి, వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి అధ్వాన్న పాలనకు ఇదొక నిదర్శనమని వ్యాఖ్యానించారు.
నాణ్యతా లోపమే కారణం..
గోడ నిర్మాణంలో పలు నాణ్యతా లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్క వర్షానికే గోడ నానిపోయి కూలిపోవడం, కూలిన గోడల నుంచి పడిన ఇటుకల మధ్య అసలు సిమెంటు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కూలిపోయిన గోడకు, క్యూ లైన్ కు మధ్య కేవలం మూడు అడుగుల దూరం మాత్రమే ఉంది. వర్షానికి మట్టి పెళ్లలు గోడమీద పడగానే గోడ కూలిపోయింది. అధికారులు ఇది నిర్మాణ లోపమేనని అంటున్నారు. గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం 72 గంటల లోగా దర్యాప్తు జరిపినివేదిక ఇవ్వాలని ఆదేశించింది.