36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

ఉచిత బస్సు అమలుకు సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. ఆర్టీసీపై భారం పడకుండా ఎలక్ట్రికల్ త్తు బస్సులను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. అయితే ఈ పథకం త్వరలోనే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలసింది. అంతా సిద్ధం చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించి ఈ మేరకు ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సిద్ధమయ్యారు. మొదటి దశలో కొన్ని బస్సులను కొనుగోలు చేసిన ప్రభుత్వం… ముఖ్యమైన నగరాలకు, పట్టణాలకు పంపుతు నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకంపై వివిధ రాష్ట్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఆర్టీసీపై భారం పడకుండా ఉండేందుకు కొన్నిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.

గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఉచితబస్సు హామీ ఇచ్చాయి.  హామీ అమలు చేయకపోతే మహిళల్లో వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వం త్వరలో అమలుచేయాలని ఎలక్ట్రికల్ బస్సులను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఉచిత ప్రయాణంతో పెద్దగా ఖర్చు లేకుండానే, భారం ఆర్టీసీపైనా, ప్రభుత్వంపైన పడకుండానే నామమాత్రంగా వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సిటీ బస్సుల్లో ఎక్కువ మంది ఉచితంగా నిత్యం తిరిగే అవకాశముందని భావించిన ప్రభుత్వం మొదటి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తుంది. ఇందులో వంద బస్సులు విశాఖపట్నానికి కేటాయించారు. మరో వంద బస్సులు విజయవాడకు ఇచ్చారు. గుంటూరుకు వంద, నెల్లూరుకు వంద, కర్నూలుకు యాభై బస్సులతో పాటు కాకినాడ, రాజమండ్రి, కడప మరియు అనంతపురం డిపోలకు 50 బస్సులు కేటాయించనున్నారు. తిరుపతితో పాటుమంగళగిరి డిపోలకు 50 బస్సులు కేటాయించారు. ఈ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్లు సంబంధిత డిపోలలో ఏర్పాటు చేయనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నచో్ట ఈ బస్సుల కేటాయింపు చేస్తూ భారం తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com