విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగంలో కొన్ని సంచలన ఆంశాలు వెలుగు చూశాయి. రాజకీయంగా కొందరు నాయకులకు మోదం కాగా మరికొందరికి ఖేదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచాంగ శ్రవణంలో ప్రముఖ జ్యోతీష్కులు, దైవజ్ఞ రత్న ఇవటూరి భవాని శంకర్… దేశ పరిస్థితులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు రాజకీయంగా వివిధ ఆంశాలను వివరించారు.
పంచాంగ శ్రవణంలో ముఖ్యంశాలు
వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బాగుంటాయన్నారు. హిమాలయ పర్వత పాద ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు జలముప్పు ఉందని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని, షేర్ మార్కెట్ దూసుకుపోతుందని తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ఠ పెరుగుతుందన్నారు. అదేవిధంగా దేశంలో కొందరు రాజకీయ నాయకులకు మంచి జరుగుతుండగా మరికొందరికి చేదు ఫలితాలు ఉంటాయని చెప్పారు.
గతంలో బెంగళూరు నుంచి వెలువడే మోడరన్ ఆస్ట్రాలజీ మ్యాగజైన్, హైదరాబాద్ కృష్ణ పత్రికల ద్వారా 10 మంది ముఖ్యమంత్రుల గురించి సరిగ్గా అంచనా వేసిన జ్యోతిష్కుడు ఇవటూరి భవాని శంకర్.
1.1994 డిసెంబర్ ఎన్నికలలో ఎన్టీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని. ఇది కృష్ణపత్రిక దినపత్రికలో ఒక నెల ముందుగానే వివరించారు.
- 2009 సెప్టెంబర్‌లో శ్రీ రాజశేఖర్ రెడ్డి మరణం. ఇది కృష్ణ పత్రిక దినపత్రికలో 9 నెలల ముందుగానే ప్రచురించారు.
- దివంగత నేత రోశయ్య 2010 నవంబర్‌లో Ntv, స్టూడియో N న్యూస్ ద్వారా అధికారం కోల్పోతారని వెల్లడించారు.
- కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూర్తి పదవీకాలం పూర్తి చేస్తారని తెలిపారు.
- తెలంగాణ మాజీసిఎం కె. చంద్రశేఖర్ రావు 2015 నుండి మంచి ఆరోగ్యం కలిగి ఉంటారని, 2018 డిసెంబర్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. ఏప్రిల్ 13, 2021న సోషల్ మీడియా ద్వారా శ్రీ కేసీఆర్ ఆరోగ్యం దెబ్బతింటుందని అంచనా వేశారు. మార్చి 2022లో Ntv ద్వారా కేసీఆర్ రాజకీయ జీవితం 2023 డిసెంబర్లో ముగిసి ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందని అంచనా వేశారు.
- ప్రస్తుత కేంద్రమంత్రి కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి అవుతారని. మహా న్యూస్ ఛానల్ ద్వారా అంచనా వేశారు.
- డిసెంబర్ 2023లో ఫేస్బుక్ ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ 2024లో మసకబారుతుందని అంచనా.
- 2014లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోతారని, ఏప్రిల్ 2, 2022న Ntv ద్వారా, మార్చి 2023లో డయల్ న్యూస్ ద్వారా జగన్ మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారని అంచనా వేశారు.
ఇక విశ్వావసు నామ సంవత్సరంలో నేతల యోగం ఎలా ఉంటుందో కొందరి గురించి వివరించారు. ప్రపంచదేశాలకు చుక్కలు చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పదవీ గండం ఉందని హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్రమోడీకి ఎదురులేదని, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మహాయోగం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల గురించి సంచలన విషయాలు చెప్పారు. ఇలా అనేక ఆంశాల్ని వివరించారు. రాహూల్‌గాంధీ, పవన్ కళ్యాణ్ యోగం ఎలా ఉందో అంచనా వేశారు.
వీరికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు youtube link