25.1 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ ఫార్మసీ చదువుతోన్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కుత్బుల్లాపూర్‌ మండలం పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వెన్నెల గడ్డలో ఈ సంఘటన జరిగింది. తన బలవన్మరణానికి కారణమేంటో సూసైడ్‌ నోట్‌ రాసి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో, హాస్టల్‌లో ఉన్న మిగతా అమ్మాయిలు, కాలేజీ క్లాస్‌మేట్స్‌, హాస్టల్‌ నిర్వాహకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రియాంక అనే యువతి.. ఫార్మసీ చదువుతూ వెన్నల గడ్డలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. రవికుమార్‌ అనే వ్యక్తితో ప్రియాంక ప్రేమలో పడింది. అయితే, రవికుమార్‌ తనను పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవడం లేదని, అందుకే జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రియాంక సూసైడ్‌ నోట్‌లో రాసింది. ప్రియాంక ఆత్మహత్యకు సంబంధించి హాస్టల్‌ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com