28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

క్రిష్ణ పట్నం పోర్టునుంచి పెట్రోలియం ఇంపోర్ట్

అదానీ కంపెనీకి కాంట్రాక్టు పొడిగించిన కేంద్రం
స్టాక్ మార్కెట్ లో పెరిగిన అదానీ ఎనర్జీస్ కంపెనీ షేర్లు

అదానీకి చెందిన క్రిష్ణ పట్నం పోర్టు నుంచి పెట్రోలియం ఇంపోర్టుకు సంబంధించిన గడువు పెంచుతూ కేంద్ర పోర్టులు, షిప్పింగ్ అండ్ జలవనరుల శాఖ తాజాగా ఆదేశాలు జారీ చే సింది. తాజా జీవో ప్రకారం సముద్ర మార్గం ద్వారా క్రిష్ణ పట్నం పోర్టునుంచి మన దేశంలోకి పెట్రోలియం దిగుమతులు చేసుకునేందుకు ఉన్న అనుమతిని 2026 మార్చి వరకూ పెంచారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను 2024 డిసెంబర్ 6న అంటే శుక్రవారం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం పోర్టుకమిటీ నావిగేషనల్ సేఫ్టీ ప్రమాణాలను అనుసరించి ఈ దిగుమతులను అదానీ క్రిష్ణ పట్నం పోర్టు చేసుకుంటుంది.

పెట్రోలియం రూల్స్ 2002 రూల్ 16(1) ప్రకారం ఆగస్టు 25,2024 నుంచి మార్చి 1,2026 వరకూ ఈ ఆదేశాలు దిగుమతికి అనుమతిస్తాయి. సాధారణంగా దేశంలో పెట్రోలియం అవసరాలను ద్రుష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకుంటుంది.
తాజా ఆదేశాలతో ఎనర్జీ సెక్టర్ లో అదానీ పోర్ట్స్ ను వ్యూహాత్మకంగా బలోపేతం చేయడానికి ఈ జీవో ఉపయోపడుతుందన్న చర్చ జరుగుతోంది.అదానీ గ్రీన్ ఎనర్జీ సెక్టర్ లో రాష్ట్రాలకు విద్యుత్ అమ్మకాలలో కుంభకోణాలు జరిగాయంటూ అమెరికా ఎఫ్ బీఐ ప్రకటించడం, ఆపై అది రాజకీయ దుమారాన్ని రేపడం తెలిసిన విషయమే. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ జీవో ను పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాలతో అదానీ పోర్ట్స్ , స్పెషల్ఎకనామిక్ జోన్ ల షేర్లు మార్కెట్ ఇంట్రాడేలలో ఒక శాతం పెరిగాయి.
సైక్లోన్ మిచాంగ్ ఎఫెక్ట్ సరిగ్గా ఏడాదిక్రితం 2023 డిసెంబర్ 9న బంగాళా ఖాతంలో మిచాంగ్ తుఫానుతీర ప్రాంత పోర్టుల రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. తుఫాన్ దాటికి ఎగుమతులు, దిగుమతులు దాదాపు స్తంభించిపోయాయి. ఏపీలోని క్రిష్ణ పట్నం పోర్టు కూడా వాతావరణం వల్ల తమ పెట్రోలియం దిగుమతులు దారుణంగా దెబ్బ తిన్నాయని, ప్రతికూల పరిస్థితుల్లో కొన్నాళ్లు ఈ ప్రక్రియను చేపట్టడం లేదని ప్రకటించాయి. కేంద్రం నుంచి కాంట్రాక్టు పద్దతిలో జీవోను అనుసరించి ఈ దిగుమతులు జరుగుతాయి కాబట్టి ఇలాంటి ప్రక్రుతి విపత్తులు వచ్చినప్పుడు సంబంధిత పోర్టులు దిగుమతులకు అంతరాయం జరిగితే ఇలాంటి ప్రకటన రిలీజ్ చేయాల్సి ఉంటుంది. చైన్నైలోని కట్టుపల్లి పోర్టు,ఎన్నోర్ పోర్టు కూడా తుఫానుదెబ్బకు మూడు రోజుల పాటు దిగుమతులు, ఎగుమతులను నిలిపివేయాల్సి వచ్చింది.
తుఫాను సమయంలో పోర్టు నిలిపి ఉంచిన నౌకల్లోకి నీరు చేరడం, ఈదురు గాలులు, అననుకూల వాతావరణం లాంటి భీకర పరిస్థితులు ఉంటాయి. నౌకలను నడపడం, లోడ్ లో నిలిపి ఉంచడం, లేదా వాటిలోని సరుకును డంప్ చేయడం కూడా కష్టమే. వేలాదిగా వెస్సల్స్ ఇలా డంపింగ్ కోసం ఎదురు చూస్తుంటాయి. అందుకే నౌకలు ప్రత్యేకించి కేంద్ర అనుమతులతో రవాణా జరిపే సంస్థలు అధికారిక ప్రకటన రిలీజ్ చేస్తుంటాయి.ఇలాంటి దిగుమతులు ఒక్క రోజు ఆపితేనే కోట్లల్లో నష్టం వస్తుంది. అలాంటి ది మూడు నాలుగు రోజులు ఆపితే చమురు నిల్వలు కూడా పడిపోతాయి. ప్రస్తుతం దేశీయ అవసరాల కోసమే అనుమతులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com