32 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

ఆశావర్కర్లకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా – హరీష్ రావు

తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నమని ఒకవైపు గొప్పలు చెప్పుకుంటూ మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రావు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భత్రద కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడ అధికారంలోకి వచ్చాక తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న ఆశా అక్కా చెల్లెమ్మలను పోలీసులతో కొట్టించడం దుర్మార్గమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆశావర్కర్లకు నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఆశా వర్కర్ల గౌరవ వేతనం కేవలం 1500 రూపాయలు ఉంటే రాష్ట్ర ఆవిర్భావం తరువాత కేసీఆర్ దాన్ని పది వేలకు పెంచి గౌరవించారని హరీష్ రావు గుర్తు చేశారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించే కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరి సిగ్గుచేటని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com