28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

మనకీ వారికీ తేడా ప్రజలు గమనిస్తున్నారు – వైఎస్.జగన్

మన ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సీర్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి అన్నారు. గురువాం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇవాల్టికీ మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఎవరైన తలెత్తుకున ప్రజల వద్దకు వెళ్లగలరని మనం చేసిన మంచే మనల్ని ప్రజల్లోక ధైర్యంగా వెళ్ళేలా చేస్తుందన్నారు. ఆరు నెలల కాలంలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను చూడలేదన్నారు. అన్ని రంగాల్లో విచ్చలవిడి అవినీతి జరుగుతోందని వైఎస్.జగన్ తెలిపారు. వేలం వేసి మరీ బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వ ఖజానాకి రూపాయి కూడా ఆదాయం రావడం లేదన్నారు. సూపర్ సిక్స్ పధకాలు ఎలా ఉన్నాయని ప్రజలకు ఫోన్లు చేసి అడుగుతున్నారని అసలు పథకాలు అమలులో ఉంటే కదా వారు సమాధానం చెప్పేది అని కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. సంక్రాంతి తరువాత తాను జిల్లాల పర్యటనలకు వస్తానని వైఎస్.జగన్ నాయకులకు చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com