37.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

పవన్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ – జగన్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్‌ చేశారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌పై సంచనల కామెంట్స్ చేశారు. విలేకరుల సమావేశంలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్‌ తనదైన శైలిలో స్పందించారు.

పవన్‌ కల్యాణ్ గురించి చెప్పుకోవాలంటే ఆయన మున్సిపాలిటీలో కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని వైఎస్‌ జగన్ వ్యాఖ్యానించారు. జీవిత కాలంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యాడన్నారు.

ఏపీలోని కూటమి ప్రభుత్వంలో పవన్‌ కల్యాణ్ పార్టీ జనసేన కూడా భాగస్వామిగా ఉంది. ఎన్నికల ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పవన్‌ కల్యాణ్‌కు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో పవన్‌ కల్యాణ్‌ వ్యవహరిస్తున్నారు. అయితే, తాజాగా వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి. వాస్తవానికి పవన్‌ కల్యాణ్ గత యేడాదికి ముందు గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి పవన్‌ కల్యాణ్ ఓటమి పాలయ్యారు. 2024లో జరిగిన ఎన్నికల్లో మాత్రం పవన్ కల్యాణ్‌తో పాటు.. జనసేన పార్టీ నుంచి పోటీచేసిన వాళ్లందరూ గెలిచారు.

మొత్తానికి, వైఎస్ జగన్‌ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com