35.2 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

రాకపోకలకు సిద్దమైన పంబన్‌ వర్టికల్‌ బ్రిడ్జి

శ్రీరామ నవమి రోజు ప్రారంభించనున్న ప్రధాని మోడీ

భారతీయ రైల్వే మరో అద్భుత నిర్మాణాన్ని ఆవిష్కరించింది. అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్న రైల్వే శాఖ ఇప్పుడు మరో వినూత్నమైన నూతన నిర్మాణాన్ని పూర్తిచేసింది. సముద్ర మార్గం గుండా అతి తక్కువ కాలం లోనే అతి పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేసింది. రామేశ్వరం లోని పంబన్ బ్రిడ్జి 531 కోట్లతో నిర్మించింది. ప్రధాని నరేంద్రమోడీ ఈ నవతరం బ్రడ్జిని శ్రీరామనవమి రోజు అంటే ఏప్రిల్‌ 6వ తేదీన ప్రారంభించనున్నారు.

పాంబన్ వర్టికల్ బ్రిడ్జి ప్రత్యేకతలు

రామేశ్వరంలోని పంబన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది.  దాదాపు నాలుగున్నరెళ్ల పాటు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. మొత్తం 580 కోట్లతో రాత్రింబవళ్ళు వందల మంది శ్రమించి పంబన్ వర్టికల్ బ్రిడ్జ్ ని పూర్తి చేశారు. తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని కలిపే ఈ రైల్వే వారధి ఇక ప్రారంభానికి సిద్ధం అయ్యింది. వర్టికల్ లిఫ్ట్ బోల్ట్ లు వాడకుండా కేవలం వెల్డింగ్ తోనే వర్టికల్ లిఫ్ట్ నిర్మించారు. వందేళ్లు మన్నిక వచ్చేలా కట్టారు.

గతంలో ఉన్న పాత పంబన్ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. 1914 వ సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన పూర్తిగా తుప్పు పట్టిపోయింది. దీంతో రైళ్ల రాకపోకలకు అవాంతరాలు ఎదురవటంతో పాటు ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేసి రైల్వే శాఖకు నివేదిక ఇచ్చారు. దీంతో 2019 మార్చి1న ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఐదేళ్ల కాలం పాటు సాగిన ఈ ప్రాజెక్టు నవంబర్ 2024 కల్లా పూర్తి కావాల్సి ఉండగా కొన్ని చిన్న చిన్న పనుల కారణంగా ఫిబ్రవరి  2025 మాసం వరకు కొనసాగింది. ఈ వంతెన నిర్మాణం అంతా కూడా చాలా కష్టతరంగా సాగింది. గాలి వానను లెక్కచేయకుండా వందల మంది కార్మికులు ఈ వంతెన నిర్మాణం కోసం శ్రమించారు. వర్టికల్ లిఫ్ట్ స్పామ్ ను నిర్దిష్ట ప్రాంతానికి 600 మీటర్ల దూరంలో తీసుకెళ్లేందుకు అధికారులు, కార్మికులు తీవ్రంగా శ్రమించారు. ఈ లిఫ్టును తీసుకెళ్లేందుకు రైలు పట్టాల మార్గం తప్ప వేరే మార్గం లేదు. ఈ లిఫ్టును నిర్దేశిత ప్రాంతానికి తీసుకెళ్ళేందుకు ఐదు నెలల సమయం పట్టింది. 660 టన్నులు 72.5 మీటర్ల పొడవున్న ఈ లిఫ్టును పట్టాలపై మాత్రమే తీసుకెళ్లాలి. లాంచింగ్ గర్డర్లు, బేరింగ్ల సహాయంతో పట్టాలపై ఎక్కించి రోజుకు కొంత దూరం కదిలించేవారు. ఈవిధంగా తీసుకు వెళ్ళడానికి ఐదు నెలల సమయం పట్టింది.

పాత పంబన్ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం దాని పైన రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి వచ్చింది. గతంలో ఉన్న పాత బ్రిడ్జి రెండుగా విడిపోయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండుగా చీలిపోయేది. కింద నుంచి షిప్పులు బోట్లువెళ్లే విధంగా అప్పట్లోనే నిర్మాణం జరిగింది. కానీ ప్రస్తుతం నిర్మించిన కొత్త వంతెన వర్టికల్ గా పైకి లేచే విధానంతో దీన్ని నిర్మించారు. ఒక మిల్లీ మీటర్ తేడా రాకుండా కొత్త వంతెన నిర్మాణం సాగింది. 2.1 0 కిలోమీటర్ల దూరంతో ఈ ట్రాక్ నిర్మాణంతో పాటు వర్టికల్ స్పాన్ లిఫ్ట్ నిర్మాణం సాగింది. 75 మీటర్ల పొడవుతో కొత్త బ్రిడ్జి నిర్మించారు. 108 సంవత్సరాలు వచ్చిన పాత వంతెన ఇప్పుడు కొత్త వంతెన కూడా అంతకంటే ఎక్కువగానే మన్నిక వస్తుందని నిపుణులు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ బ్రిడ్జి తుప్పు పట్టకుండా ఉండేందుకు ఫాలో సీల్ ఈ బ్రిడ్జి తుప్పు పట్టకుండా ఉండేందుకు ఫాలో సిలోక్సెన్ పెయింటింగ్ పూత వేశారు. 58 ఏళ్ల వరకు ఈ ప్రాజెక్టుకు డోకా లేదని చిన్నచిన్న మరమ్మత్తులు రెగ్యులర్ గా చేస్తే దాదాపు వందేళ్ళకు పైగానే ఈ ప్రాజెక్టు మన్నిక ఉండేలా పెయింటింగ్ పూత వేశారు. 58 ఏళ్ల వరకు ఈ ప్రాజెక్టుకు డోకా లేదని చిన్నచిన్న మరమ్మత్తులు రెగ్యులర్ గా చేస్తే దాదాపు వందేళ్ళకు పైగానే ఈ ప్రాజెక్టు మన్నికగా ఉంటుందిని ఇంజనీర్లు చెపుతున్నారు.

దాదాపు ఐదు సంవత్సరాల్లోనే ఈ బ్రిడ్జి పూర్తయిందని యువ ఇంజనీర్ తెలుగువాడైన నడుమూరి వెంకట చక్రధర్ తెలిపారు. ఈ వంతెన నిర్మించేటప్పుడు తుఫాన్లు గాలి వాన బీభత్సంగా వచ్చిందని దీని కోసం ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 2019లో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనా 2020 నుంచి పనులు మొదలయ్యాయని లిఫ్ట్ తరలించడానికి చాలా సమయం పట్టిందని చక్రధర్‌ చెప్పుకొచ్చారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం కూడా అంతా సులువు ఏమి కాదని సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే టూరిస్టులు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఈబ్రిడ్జి రెండు దేశాలను కలుపుతుందని తెలిపారు.  పాత వంతెన లిఫ్ట్ చేయాలంటే 45 నిమిషాల పాటు సమయం పడుతుంది కానీ ఈ కొత్త వంతెన కేవలం 5నిమిషాల్లోనే లిఫ్ట్ చేయ్యవచ్చని శ్రీధర్‌ పేర్కొన్నారు.

పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు సముద్ర తీరం నుంచి సుమారు 58 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులను కూడా  రైళ్ళు తట్టుకునేలా సెన్సార్లను కూడా అమర్చారు. గాలి వేగాన్ని కొలిచే దిమ్మెలు టవర్లపై యంత్రాలు కూడా ఉన్నాయి. గిన్నెలోని గదుల్లో దేశ విదేశాల నుంచి తెప్పించిన మోటార్లు చక్రాలు కూడా అమర్చారు. ఏప్రిల్ 6 శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com