తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను సమర్పించారు. ఇందులో ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్‌పై ముఖ్యాంశాలు ప్రస్తావించారు. 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు కాగా, గడచిన సంవత్సరంలో ఖర్చు అయిన మొత్తం రూ.2,19,307 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్లో 79 శాతం ఖర్చయినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. జీఎస్డీపీలో ఈ వ్యయం 15 శాతంగా నమోదైంది. అదనంగా రూ.1,11,477 కోట్లు ఖర్చయ్యాయి.
కాగ్ నివేదికలో కీలక అంశాలు :
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ద్వారా : ప్రభుత్వం రూ.10,156 కోట్లు పొందింది.
ఓవర్‌డ్రాఫ్ట్ : రూ.35,425 కోట్లు 145 రోజులపాటు వాడుకుంది.
వడ్డీల చెల్లింపులు : 2023-24లో రూ.24,347 కోట్లు.
వేతన ఖర్చు : రూ.26,981 కోట్లు.
పన్ను ఆదాయం : ఖజానా నిధులలో 61.83 శాతం పన్నుల ద్వారా లభించింది.
కేంద్రం నుంచి గ్రాంట్లు : మొత్తం రూ.9,934 కోట్లు.
రెవెన్యూ వ్యయం : మొత్తం రాబడిలో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పింఛన్లకు ఖర్చైంది.
రెవెన్యూ మిగులు : రూ.779 కోట్లు.
రెవెన్యూ లోటు : రూ.49,977 కోట్లు (జీఎస్డీపీలో 3.33 శాతం).
మొత్తం రుణాలు : ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ.4,03,664 కోట్లు.
జీఎస్డీపీలో అప్పులు : 2023-24లో 27 శాతం.
ప్రభుత్వ గ్యారంటీలు : మొత్తం రూ.2,20,607 కోట్లు.
మూలధన వ్యయం : రూ.43,918 కోట్లు.
స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు నిధులు : రూ.76,773 కోట్లు.
స్థానిక సంస్థల నిధుల్లో పెరుగుదల : 11 శాతం.