30.5 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

అసలు నిజం ఒప్పుకున్న పాక్ మంత్రి…

అసలు ఉగ్రవాదానికి మాకు సంబంధమేంటి? ఉగ్రవాద సంస్థలు అంటే ఏంటో కూడా తెలీదు.. ఇలా సాగిపోతుండేవి పాకిస్థాన్ సుమతీ శతకాలు. అసలు ఉగ్రవాదం అనేది తమ దేశంలో లేనే లేదు అన్నట్టుగా సాగేవి ఆ దేశ మాటలు. కానీ ఇప్పుడా దేశ కుటిల నీతి బయటపడింది. పాక్ అసలు ఉగ్రవాదులకు స్వర్గధామం అనే మాటను ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు అనేవి. ఇప్పుడు ఆ మాట పూర్తిగా నిజమని స్వయంగా ఆదేశ రక్షణశాఖ మంత్రి బహిరంగంగా ఒప్పుకున్నారు. దీంతో పాక్ అసలు బుద్ధి బయటపడింది.

తాము ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చాం.. 30 ఏళ్ల పాటు చాలా చెత్త పనులు చేశాం.. వారికి నిధులు కూడా అందించాం.. అని ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు పాక్ ప్రస్తుత డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్. నిన్న మొన్నటి వరకు పాక్‌లో ఉగ్రవాదులే లేరని చెప్పిన ఈ మనిషి ఇప్పుడు ఈ విషయాన్ని అంగీకరించారు. అయితే తాము అమెరికా కోసమే ఈ చెత్త పనులు చేశామన్నారు ఖవాజా.

అమెరికా మాత్రమే కాదు.. బ్రిటన్‌తో పాటు అనేక పశ్చిమ దేశాల కోసమే తాము చాలా చెత్త పనులు చేశామంటున్నారు ఖవాజా. ఇప్పుడు తాము చేసిన పోరపాటు ఏంటన్నది తెలిసి వచ్చిందంటున్నారు. ఈ పనుల వల్ల పాక్ చాలా నష్టపోయిందన్నారు ఆయన.

నిజానికి పాక్‌లో ఉగ్రవాదానికి ఆజ్యం పోసింది అమెరికా అన్నది చాలా నిజం. అఫ్ఘానిస్థాన్‌ నుంచి సోవియట్ యూనియన్‌ను తరిమి కొట్టడానికి స్థానిక తిరుగుబాటు దారులకు ఆయుధాలు అందించింది అమెరికా. వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చింది. అయితే వారి పని పూర్తైన తర్వాత కథ మొత్తం మారింది. ఆ పోరాట సంస్థలే తర్వాత తీవ్రవాద సంస్థలుగా మారాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలకు ప్రారంభోత్సవాలు చేసింది పాక్ వేదిక నుంచే.

ఇప్పుడదే విషయాన్ని గుర్తు చేస్తోంది పాక్. తాము USSRకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలపకుండా ఉండి ఉంటే.. పాక్ పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు. కానీ ఇన్నాళ్లు ఈ దోస్తీ వాళ్ల చాలా లబ్ధి పొందింది పాకిస్థాన్. అమెరికాను నమ్ముకునే భారత్‌తో యుద్ధాలు కూడా చేసింది. కానీ ఇప్పుడు నెపం మొత్తాన్ని అమెరికాపైకి నెట్టి.. తన తప్పు ఏం లేనట్టు కలరింగ్ ఇస్తోంది. మొత్తానికైతే ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామం అనే విషయాన్ని ఎట్టకేలకు బహిరంగంగా అంగీకరించింది పాకిస్థాన్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com