హీరోయిన్ నైరా బెనర్జీ తెలుగు, తమిళం, మళయాలం, హిందీ సినిమాల్లో ప్రేక్షకులను అలరించింది. బెంగాలి ముద్దగుమ్మకు సినిమాలు తగ్గి వెబ్ సీరీస్ తో బిజీగా ఉంది. వెండితెరపై మక్కువతో అవకాశాల కోసం అందచందాలతో సోషల్ మీడియాలో గాలం వేస్తోంది
బెంగాలి కుటుంబానికి చెందిన నైరా బెనర్జీ 1987లో ముంబైలో జన్మించింది
హిందుస్థాని సంగీతం, కథక్ నృత్యంలో నైరాకు ప్రావిణ్యం ఉంది
నైరా బెనర్జీ అసలు పేరు మదురిమ బెనర్జీ… సినిమాల కోసం పేరు మార్చుకుంది
2009లో తెలుగులో ఆ ఒక్కడు సినిమాతో వెండితెరకు పరిచయం అయింది
వంశీ దర్శకత్వంలో 2010లో సరదాగ కాసేపు సినిమాలో అల్లరి నరేష్ సరసన నైరా సందడి చేసింది
2017 తర్వాత సినిమాల తగ్గటంతో బుల్లితెరపై కన్నేసిన నైరా అక్కడ బిజీ అయిపోయింది
2019 నుంచి 2020 వరకు బుల్లితెరపై వచ్చిన దివ్యదృష్టి ధారవాహికతో పేమస్ అయింది
2009 నుంచి 2017 వరకు సినిమాలతో బిజీగా ఉన్న నైరాకు హఠాత్తుగా సినిమా అవకాశాలు తగ్గాయి
మళ్లీ అవకాశాల కోసం చూస్తున్న నైరా.. తన అందం ఒంపు సొంపుల్లో ఎలాంటి మార్పు లేదని చెపుతూ సోషల్ మీడియాలో ఫోటోలు తెగ పోస్టు చేస్తోంది
courtesy : instagram