33.2 C
Hyderabad
Saturday, October 31, 2026

Live Video

spot_img

పహెల్‌గామ్ ఉగ్రవాదుల్లో పాక్ ఆర్మీ కమాండో!

పహెల్‌గామ్ ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ ఉంది. ఇది కేవలం భారత్ చేస్తోన్న ఆరోపణ మాత్రమే అంటోంది పాకిస్థాన్. కానీ దీనికి సంబంధించి ఆధారాలు ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అధికారికంగా సాధించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న NIA.. దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల పూర్తి వివరాలను బయటికి తీసే పనిలో పడింది. ఈ దాడుల్లో పాల్గొన్న హషిమ్ మూసా అనే ఉగ్రవాదికి పాక్ సైన్యంతో సంబంధాలు ఉన్నట్టు ఇప్పుడు ఆధారాలు లభించాయి.

హషిమ్ మూసా పాక్‌ పారా కమాండో అని, లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు NIA గుర్తించింది. పాక్ ఆర్మీ స్పెషల్ యూనిట్ అయిన స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో ఓ కమాండోగా ఉండేవాడని తేల్చింది. మూసాను LeT కోసం పనిచేయాలని పాక్ ఆర్మీ అధికారులు కోరగా.. అతను అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. పాక్ ఆర్మీకి సంబంధించిన కోవర్ట్ ఆపరేషన్స్ కోసం అతను ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అతడిని ఉగ్రవాద సంస్థ కోసం పనిచేసేందుకు ఒప్పించినట్టు సమాచారం.

హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోనేందుకు మూసాకు పాక్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాలన్ని ఈ ఉగ్రదాడికి సహాయపడిన వారిని విచారించగా బయటికి వచ్చాయి. ఇప్పటి వరకు 14 మంది అనుమానితులను NIA అదుపులోకి తీసుకుంది. వీరంతా ఈ ఉగ్రదాడికి కావాల్సిన సమాచారం, ఆయుధాలు చేరవేసినట్టు గుర్తించారు.

ఈ మూసా 2024లో జరిగిన మూడు దాడుల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. మూసాతో పాటు ఈ దాడిలో పాల్గొన్న మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు అలీ భాయ్, ఆదిలో థోకర్, ఆసిఫ్‌ షేక్ కూడా పాకిస్థాన్‌లోనే ట్రైనింగ్ పొందినట్టు తెలుస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com