27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

అక్కడ కూడా ట్రెండ్‌ అవుతోన్న పహల్‌గామ్‌!

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన టెర్రరిస్టుల దాడిపై ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు, పాకిస్తాన్‌లో కూడా వాతావరణం వేడెక్కింది. ప్రపంచ దేశాల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈనెల 22వ తేదీన మంగళవారం జరిగిన ఈ భయానక దాడిపై ఒకవైపు భారతదేశంలో కోపం, ఆవేదన రగులుతోంది. మరోవైపు.. పాకిస్తాన్‌లోని ఇంటర్నెట్ యూజర్లు కూడా పహల్గాం ఉగ్రమూకల దాడికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఈ ముష్కర దాడిపై జరుగుతున్న సోషల్‌ మీడియా డిస్కషన్స్‌లో పాల్గొంటున్నారు. భారత దేశం రియాక్షన్స్‌, మోదీ సర్కారు వ్యూహాలు, తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకుంటున్నారు.

పహల్గాంలో ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్‌లోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌, గూగుల్‌లో దీనికి సంబంధించిన కీవర్డ్స్‌ వేగంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆయా సంస్థల రిపోర్టుల ప్రకారం పాకిస్తాన్‌లోని ప్రజలు పెద్ద సంఖ్యలో ‘పహల్గాం, పహల్గాం ఎటాక్, కాశ్మీర్, పుల్వామా, జమ్ము ‘ వంటి పదాల గురించి వెతుకుతున్నారు. ఈ ఉగ్రవాద ఘటన తరువాత భారతీయ సోషల్ మీడియాలో #PahalgamTerroristAttack, #Modi వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండగా, పాకిస్తాన్‌లో కూడా ఈ దాడిపై ప్రజల ఆసక్తి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ వినియోగదారులు ఈ దాడిపై వేర్వేరుగా స్పందిస్తున్నారు. ఈ దాడిపై పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ దాడిలో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. అయితే, సోషల్ మీడియాలో పాకిస్తాన్ యూజర్ల ప్రతిస్పందన ద్వారా ఈ ఘటన అక్కడ కూడా కలకలం రేపిందని స్పష్టమవుతోంది.

అదే సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని భారతదేశం సహించదని ఆయన స్పష్టంచేశారు. అంతేకాదు.. దానికి తగిన ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. అలాగే, ఈ ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రగాడ సంతాపం తెలిపారు. ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ‘ఈ దాడి అమానుషమైనది మాత్రమే కాదు, సిగ్గుచేటు ప్రయత్నం. దీనికి స్పందన కచ్చితంగా బలంగా ఉంటుంది. చేసిన వాళ్లనే కాకుండా దీని వెనుక ఉన్న వారిని కూడా బయటకు లాగుతాం’ అని వ్యాఖ్యానించారు. గూగుల్‌లో ట్రెండ్ అవుతున్న కీ వర్డ్‌లను బట్టి.. భారతదేశంలో మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా పహల్గాం దాడికి సంబంధించిన వివరాలు, ఆ తర్వాత చోటు చేసుకుంఉటన్న అప్‌డేట్స్‌ తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. సెర్చ్ ట్రెండ్స్‌ను విశ్లేషిస్తే.. పాకిస్తాన్ పౌరులు భారత్-పాక్ సంబంధాలపై ఈ ఉగ్ర దాడి ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నారని అర్థమవుతోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com