భారత అంతరిక్ష పరిశోదన సంస్థ – ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన శ్రీలంక పర్యటనలో ఉండగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో, కటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చి.. నారాయణ హెల్త్ సిటీలో చేర్పించారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించడంతో కస్తూరి రంగన్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
కాగా, గతంలో కస్తూరి రంగన్.. జేఎన్‌యూ వైఎస్ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 2003 నుంచి 2009 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ చైర్మన్‌గా వ్యవహరించారు. తొమ్మిది సంవత్సరాలు పాటు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ISROకి చైర్మన్‌గా పని చేశారు.