విత్తనం మొలకెత్తాలంటే.. మట్టి బాగుండాలి.. దానికి నీరందాలి.. అప్పుడే ఆ విత్తనం భూమిని చీల్చుకుంటూ మొలకెత్తి మొక్కగా మారుతుంది. కానీ ఇవేమీ లేకుండానే స్పేస్‌లో ఓ విత్తనాన్ని మొలకెత్తేందుకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించింది ఇస్రో. సృష్టించడమే కాదు.. స్పేస్‌లోకి పంపిన నాలుగు రోజుల్లోనే ఈ విత్తనాలు మొలకెత్తాయి కూడా.
ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ రీసెంట్‌గా ఇస్రో స్పేస్‌లోకి పంపిన స్పేడెక్స్ శాటిలైట్‌లోనిది. పీఎస్‌ఎల్‌వీ సీ 60 ద్వారా మొత్తం 24 పేలోడ్స్‌ను స్పేస్‌లోకి పంపింది. అందులో కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిట్ ప్లాంట్ స్టడీస్ అనే మాడ్యూల్ కూడా ఉంది. ఇందులోనే 8 అలసంద గింజలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి స్పేస్‌లో మొలకెత్తాయి.
సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కలను పెంచడం అనేది ఇస్రో టార్గెట్. ఫ్యూచర్‌లో చేపట్టబోయే స్పేస్ జర్నీలకు ఇది చాలా అవసరం అని భావిస్తోంది. అందుకే అస్ట్రోనాట్స్ స్పేస్‌లోనే తమ ఆహారాన్ని సాగు చేసుకునేలా ఈ క్రాప్స్ మాడ్యూల్‌ను డెవలప్ చేశారు. ఇందులో టెంపరేచర్‌ను కంట్రోల్ చేసే ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాదు విత్తనాలు ఎలా మొలకెత్తుతున్నాయని తెలుసుకునేందుకు ఓ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విత్తనం మొలకెత్తి.. రెండు ఆకుల దశకు చెరుకునేలా ఈ మాడ్యూల్‌ను డెవలప్ చేశారు.