- ఫామ్ కోల్పోయాను… అందుకే తప్పుకున్నాను
రిటైర్మెంట్ పై రోహిత్ శర్మఎట్టకేలకు రోహిత్ శర్మ నోరు విప్పాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలకు చెక్ చెప్పాడు. ఆ వార్తలన్నీ ఫేక్ అన్నాడు. వాటిని పట్టింకోనని అన్నాడు. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… ఏ ఆటగాడికైనా ఫామ్ కోల్పోవడం అనేది సహజంగా జరుగుతుంటుందని అన్నాడు. కాకపోతే నేనింకా.. లయ అందుకోలేక పోతున్నాను. బహుశా మరో ఆరు నెలల సమయం పట్టవచ్చు. లేదా ఇంక రాకపోవచ్చునని కూడా అన్నాడు.
నేనైతే అంత అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోనని అన్నాడు. ఇంకా నాకు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత అంతా ఖాళీయే కదాని నవ్వుతూ అన్నాడు. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి మంచి భవిష్యత్ ఇవ్వాలి. రిటైర్మెంట్ అనేది అంత ఈజీ కాదని అన్నాడు. అయితే తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు, ఎవరి చేతుల్లో కూడా లేదని అన్నాడు.
మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ… నా అంతట నేనే జట్టు నుంచి తప్పుకున్నాను. ఇదే మాట కోచ్ కి చెప్పాను, సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ కి చెప్పానని అన్నాడు. ఇది ఒక ఆరోగ్యకరమైన పద్ధతని అన్నారు. సరిగ్గా ఆడకపోతే కెప్టెన్ అయినా డకౌట్ లో కూర్చోవలసిందే నని అన్నాడు. మిగిలిన క్రీడాకారులు అప్రమత్తంగా ఉంటారని అన్నాడు. ఎప్పుడైనా మన పరిస్థితి మనకు తెలుస్తున్నప్పుడు జట్టుకి భారంగా మారకూడదని అన్నాడు. అది జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు.
ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గురించి ఆలోచించడం లేదని అన్నాడు. ప్రాక్టీస్ పైనే ఫోకస్ పెట్టినట్టు తెలిపాడు. మొత్తానికి రోహిత్ శర్మ చెప్పిన మేసేజ్ ఏమిటంటే, సరిగ్గా అడకపోతే, ఎంత పెద్ద ఆటగాడినైనా పక్కన కూర్చోపెట్టక తప్పదని చెప్పకనే చెప్పాడు. బహుశా ఇది కోహ్లీకి కూడా ఒక హెచ్చరిక అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.