కీలక చివరి టెస్ట్ మ్యాచ్‌లో మరోసారి టీమ్ ఇండియా చేతులెత్తేసింది. మొదట బ్యాటర్లు.. ఆ తర్వాత బౌలర్లు విఫలం అవడంతో.. రెండో సెషన్లోనే మ్యాచ్ ముగిసింది. ఆసీస్ బ్యాటర్లు దాటిగా ఆడి.. 162 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేజ్ చేశారు. భారత బౌలర్లకు ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా టార్గెట్‌ను ఈజీగా ఫినిష్ చేశారు ఆసీస్ బ్యాట్స్‌మెన్.
6 వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ 141 పరుగులు చేసిన భారత్.. మూడో రోజు ఆరంభంలో తడబడింది. కేవలం 16 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోని దిగిన ఆసీస్.. ధనాధన్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తొలి బంతి నుంచే టీమిండియా బౌలర్లను టార్గెట్ చేసింది. ఓపెనర్ సామ్ కోన్స్టాస్ 17 బంతుల్లో 22, కవాజా.. 45 బాల్స్‌లో 41 రన్స్ చేశారు. స్మిత్, లబుషేన్ త్వరగా ఔట్ అయినా.. హెడ్ అదే ఊపును కొనసాగించాడు. 38 బంతుల్లో 34 రన్స్ చేశాడు. యంగ్‌స్టర్ వెబ్టర్ 39 పరుగులతో సత్తా చాటడంతో ఆసీస్ సునాయసంగా మ్యాచ్ గెలిచింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది.
గాయం కారణంగా బుమ్రా మ్యాచ్‌కు దూరం అవడంతో.. స్టాండ్ బై కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరించాడు. పేస్ దళాన్ని నడిపించిన సిరాజ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను ఇబ్బందిపెట్టినా.. సిరాజ్ సహకరించకపోవడంతో భారత్ ఓటమి తప్పలేదనే చెప్పాలి.
ఈ ఓటమితో WTC ఫైనల్స్ ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టైంది. ఇక ఈ నెల 17 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌పై భారత్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది.