సినిమా టికెట్ ధరల పెంపుపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డిమాండ్ సప్లై ఆధారంగానే టికెట్ ధరల పెంపు ఉంటుందన్నారు. గేమ్ చేంజర్ బెనిఫిట్ షో రేట్లకు అనుమతి ఇవ్వటంపై స్పందించిన పవన్ కళ్యాణ్ వివిధ ఆంశాల్ని ప్రస్తావించారు.
పవన్ కళ్యాణ్ కామెంట్స్
నేను శంకర్ సినిమాను బ్లాక్ లో టికెట్ కొని చూశాను. బ్లాక్ లో టికెట్ కొనడం వల్ల ఆ డబ్బు వేరేవాళ్లకు వెళ్తుంది. ప్రభుత్వం టికెట్ ధరలు ఊరికే పెంచడం లేదు. టికెట్ ధరలు పెంచడం వల్ల టికెట్ పై జీఎస్టీ కడతారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
గత ప్రభుత్వం భీమ్లా నాయక్ చిత్రానికి టికెట్ ధరలు పెంచలేదు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు. చిన్నపాటి పెన్సిల్ తయారీకే ఎన్నో దేశాల నుంచి కలిసి రావాలి. సినిమా అంటే అన్ని ప్రాంతాల కలయిక ఉంటుంది.
భారతీయ చిత్ర పరిశ్రమ అనేదే మన నినాదం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని కాదు. హాలీవుడ్ పద్దతులు పాటించకపోయినా వుడ్ మాత్రం తీసుకున్నాం. మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా విశ్వానికి చూపించాలి. చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ రావాలి.
సినిమాలు తీసే వాళ్లే మాట్లాడాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటే సినిమాలు తీసే వాళ్లే మాట్లాడాలి. సినిమాలు తీస్తే వాళ్లతోనే మాట్లాడుతాం. సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనేంటీ. సినిమా టికెట్ ధరల విషయంలో నిర్మాతలు రావాలి. హీరోలు వచ్చిన నమస్కారాలు పెట్టాలనేంత కిందిస్థాయి వ్యక్తులం కాదు.
ఎన్టీఆర్ పాటించిన ఔన్నత్యాన్ని మేం పాటిస్తున్నాం. సినీ పరిశ్రమపై కూటమి ప్రభుత్వానికి గౌరవం ఉంది. సీఎం చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నిజ జీవితంలో జరగని సంఘటనలు సినిమా ప్రపంచంలో స్ఫూర్తినిస్తాయి. సినిమా ప్రపంచంలో విలువలుంటాయి. సినిమా మంచి చెడు రెండును చూపిస్తుంది. ఏది తీసుకోవాలో ప్రేక్షకుల ఇష్టం. కేవలం డబ్బులు సంపాదించడం కాదు విలువలు నేర్పించాలి.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమాజాన్ని ఆలోచింపచేసే బాధ్యతతో సినిమాలు తీయాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రజలను ఆలోచించే సినిమాలు రావాలి. సినిమా టికెట్ ధరల పెంపు ప్రభుత్వానికి ఆదాయం కూడా..పెరిగిన టికెట్ ధరపై 18 శాతం జీఎస్టీ వస్తుంది.
ఓజీ సినిమాపై మరో వేదికలో మాట్లాడుతాను. ఏపీ ప్రభుత్వం తరపున గేమ్ ఛేంజర్ సినిమాకు శుభాకాంక్షలు. ఎస్ జే సూర్య దర్శకత్వం వదిలేయడం బాధగా ఉంది. కొత్త సంవత్సరంలో బాక్సాఫీసు బద్దలైపోవాలి. ఏపీలో స్టూడియోలు పెట్టాలి. ఏపీలోని యువతకు నైపుణ్యాభివృద్ధి చేసేలా చూడాలి. ఏపీలోని యువతకు ఉపాధి మార్గాన్ని చూపించాలి.
ఏపీలోని పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్ లు ఎక్కువ చేయాలి. పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది..