- ఉదయం నుంచి కఠిన సాధన
- నేడే ఇంగ్లండ్ తో టీ 20 సిరీస్…
- కోచ్ గౌతమ్ గంభీర్ ముఖంలో నవ్వులు
అందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇంగ్లండ్ తో 5 టీ 20ల సీరిస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బుధవారం రాత్రి 7 గంటలకు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో యువ క్రికెటర్లతో నిండిన టీ 20 జట్టు బరిలో దిగనుంది. సూర్యకుమార్ కెప్టెన్సీలో వరుసపెట్టి సిరీస్ గెలుస్తూ వస్తున్న టీమ్ ఇండియా బోణీ కొడుతుందా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
సీనియర్ల జట్టుతో తలబొప్పి కట్టిన కోచ్ గౌతం గంభీర్ ముఖంలో మళ్లీ చిరునవ్వులు కనిపించాయి. ఎందుకంటే తన హయాంలో ఆడిన టీ 20 సిరీస్ లన్నీ గెలవడమే అందుకు కారణం. దీంతో ఈడెన్ గార్డెన్ లో తను చాలా ఉత్సాహంగా కనిపించాడు. నిజానికి కెప్టెన్ సూర్యకుమార్ కి తనెంతో రుణపడి ఉన్నాడని చెప్పాలి. టీ 20 సిరీస్ కూడా ఓడిపోయుంటే, గౌతంని వెంటనే తప్పించేవారని అంటున్నారు.
ఈ మ్యాచ్ లో చాలాకాలం తర్వాత మహ్మద్ షమీ మళ్లీ ఆడనున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేస్తున్నాడు. ఇప్పటికే దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టాడు. దీంతో తన భవిష్యత్తును నిర్ణయించే కీలక సిరీస్ గా ఇది మారనుంది. ఇక్కడ షమీ విజృంభిస్తే…రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి మార్గం సుగమం అవుతుంది. అప్పుడు బుమ్రాపై ఒత్తిడి తగ్గుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఈ సిరీస్ లో గెలవడం చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఆసిస్ చేతిలో చావుదెబ్బ తిన్న సీనియర్లు మిగిల్చిన విషాదం నుంచి ఆటగాళ్లు బయటకు రావాలంటే ఇది గెలవాల్సిందే. ఎందుకంటే ఇది అందరికీ ఆత్మవిశ్వాసాన్నిస్తుంది, ఒక టానిక్ గా పనిచేస్తుందని అంటున్నారు. ఇకపోతే సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా కుర్రాళ్లు ఉదయం నుంచి నెట్ లో తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్నారు.
ఇంగ్లండు జట్టులో కూడా టీ 20 ప్లేయర్లుగా వీరాధివీరులున్నారు. వారు కూడా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. అందుకని వారితో పోటీపడటం అంత ఈజీకాదని విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.
టీమ్ ఇండియా తుది జట్టు ఇలా ఉండవచ్చు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్. మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్ ఎలవన్…: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), లివింగ్ స్టన్, గస్ అట్కిన్సన్, జెమీ ఒవర్టన్, బెన్ డకెట్, మార్క్ వుడ్, అడిల్ రషీద్, జాకబ్ బెతెల్, జోప్రా అర్చర్