35 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

మన బంధం బలమైంది.. యూనస్‌కు మోదీ లేఖ

బంగ్లాదేశ్‌ 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోంటోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్‌కు ప్రత్యేకంగా ఓ లెటర్ రాశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని, స్నేహ సంబంధాలను గుర్తు చేశారు. భారత్-బంగ్లా దేశాల మధ్య ద్వైపాక్షిక బంధానికి పునాది పడింది ఈరోజేనన్నారు మోదీ. ఇరు దేశాలు చేసిన త్యాగాలకు నిదర్శనం ఈ స్వాతంత్ర్యమన్నారు మోదీ. నిజానికి బంగ్లాదేశ్‌ నేషనల్‌ డేను 2021లో ఇరు దేశాల మధ్య ఫ్రెండ్ షిప్‌ డేగా అభివర్ణించారు ప్రధాని మోదీ

మోదీ మాత్రమే కాదు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా బంగ్లాదేశ్‌ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ప్రజల తరపున తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు ముర్ము. ఇరు దేశాల మధ్యం బంధం ఈనాటిది కాదని.. ఇరు దేశాల మధ్య అనేక వాణిజ్య ఒప్పందాలతో పాటు.. విద్య, సాంస్కృతిక బంధం ఉందన్నారు ఆమె. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఎదగాలని ఆశించారు ఆమె.

షేక్ హసినాను గద్దె దించిన తర్వాత ఇరు దేశాల మధ్య కాస్త దూరం పెరిగింది. పాక్‌ అనుకూల ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు అక్కడ కొంత మంది ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. భారత్‌లో ఉన్న షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ కూడా డిమాండ్ చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కాస్త దూరం పెరిగింది. ఈ బంధాలను మళ్లీ పట్టాలెక్కించేందుకు ఇరు దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయనే చెప్పాలి. ఇదే సమయంలో మోడీ ఈ లెఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com