29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

వైకుంఠద్వార దర్శనాల్లో సామన్య భక్తులకే పెద్దపీట – టీటీడీ చైర్మన్‌

ఏకాదశి సందర్శంగా తిరుమలలో వైకుంఠద్వారా దర్శనానికి సామాన్యులకే పెద్దపీట వేస్తామని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు తెలిపారు. బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశామని 10వ తేదీ వేకువ జామున 4.30 గంటలకు ప్రొటోకాల్‌ దర్శనాలు ప్రారంభమవుతాయని బీఆర్‌నాయుడు ప్రకటించారు. వైకుంఠేకాదశి రోజు ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం అవుతుందని చెప్పారు. వైకుఠద్వార దర్శనాల సందర్భంగా అన్ని ప్రత్యేక దర్శనాలను పదిరోజుల పాటు రద్దు చేశామన్నారు. ఎక్కువ మంది సామాన్యభక్తులకు దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేశామని ఆయన పేర్కొన్నారు. టికెట్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకూడదని చైర్మన్‌ విజ్ఞప్తి చేశారు. సీఎం అదేశాల‌ ప్రకారం సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసామన్నారు. మైసూరు నుంచి వచ్చిన నిపుణులతో చేసిన పుష్పాలంకరణలు ఈసారి ప్రత్యేక ఆక్షర్ణగా నిలుస్తాయన్నారు. భద్రత దృష్ట్యా 3 వేల సిసి కెమరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టోకన్లు, టిక్కెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించరని…కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అలాంటిది ఏమీ లేదని తిరుమలకు వచ్చే భక్తులను ఎవరు ఆపరు…ఆపలేరని బీఆర్‌నాయుడు స్పష్టం చేశారు. HMPV అనే కొత్త రకమైన వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో ‌…భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలని టీటీడీ చైర్మన్‌ విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com