- దుబాయ్ లో రేస్ ప్రాక్టీస్ సెషన్ లో ఘటన
- సినీనటుడు సేఫ్..యాక్సిడెంట్ వీడియోలు వైరల్..
దుబాయ్లో ఓ కార్ రేసింగ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ లో ఉన్న తమిళ హీరో అజిత్ కుమార్ రేసింగ్ కారుకు ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అత్యంత వేగంతో దూసుకుపోతున్న అజిత్ కారు రేసింగ్ ఎడ్జిని ఢీకొని విపరీతమైన స్పీడ్ తో గింగిరాలు తిరిగింది. స్వల్పంగా నిప్పు కూడా రాజుకుంది.యాక్సిడెంట్ జరిగిన తీరు, వీడియో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కానీ హీరో అజిత్ కుమార్ ఈ యాక్సిడెంట్ నుంచి సురక్షితంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్లో త్వరలోనే జరగనున్న 24 గంటల రేస్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఆయన తన టీమ్ తో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆరు గంటల ఫిట్నెస్ టెస్ట్ ఈవెంట్ ను అలవోకగా పూర్తి చేసేస్తుండగా, చివరి ఆరు నిమిషాల్లో ఊహించని ఈ ప్రమాదం జరిగింది. అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ దుబాయ్ పోటీలో గెలుపు కోసం చాలా సిన్సియర్ గా ట్రై చేస్తోంది. అజిత్ రేసింగ్ కారు ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రమాదంలో నటుడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊరట చెందారు.అజిత్ కుమార్ కు కార్ రేసింగ్ అంటే విపరీతమైన పిచ్చి.ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఆయన వెళిపోతూ ఉంటారు.