రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చాలా దేశాలకు కలిసి వస్తోంది. ముఖ్యంగా ఆయుధాలను తయారు చేసే కంపెనీలకు. ఇప్పటికే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు లాభాల పంట పండుతోంది. రీసెంట్‌గా ఉక్రెయిన్ ఓ కీలక ప్రకటన చేసింది. తాము అత్యాధునిక లేజర్ ఆయుధాలను డెవలప్ చేసినట్టు ప్రకటించింది. వీటికి ట్రైజుబ్‌గా నామకరణం చేసింది. ఆకాశంలో దూసుకొచ్చే ముప్పును 2 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించి నాశనం చేయడం దీని స్పెషాలిటీ. వీటిని ఉపయోగించి యుద్ధ విమానాలను కూల్చేయవచ్చని చెబుతోంది ఉక్రెయిన్.
అసలు ఉక్రెయిన్ లేజర్ ఆయుధాలను ఎప్పుడు రూపొందించింది? ఎంత కాలం నుంచి వీటిపై పరిశోధనలు జరుపుతోంది? అనేది మాత్రం చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన వివరాలను కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే నిజంగా ఉక్రెయిన్ వద్ద ఇలాంటి లేజర్ వేపన్స్ ఉన్నాయా? లేక రష్యాతో మైండ్ గేమ్ ఆడేందుకు కొత్త ఎత్తుల్లో ఇదో భాగమా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. నిజానికి అమెరికా తన అత్యాధునిక ఆయుధాలను టెస్ట్ చేసుకునేందుకు ఉక్రెయిన్‌ను, ఇజ్రాయెల్‌ను వాడుకుంటుందన్న అనుమానాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో కాస్త డేంజర్ కాబట్టి.. ఎక్కువగా ఉక్రెయిన్‌లోనే పరీక్షించుకుంటుందన్న వాదన ఉంది. ఇప్పుడు కూడా లెటెస్ట్‌గా డెవలప్ చేసిన లేజర్ వేపన్‌ను ఉక్రెయిన్ పేరు చెప్పి రంగంలో దించే అవకాశం లేకపోలేదు.
నిజానికి యూఎస్ నేవీలో 2014 నుంచే లేజర్ వెపన్స్‌ను ఉపయోగిస్తున్నారు. బయట మార్కెట్‌లో దొరికే కొన్ని పరికరాలతో డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ తయారు చేయవచ్చంటున్నారు నిపుణులు. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, డ్రోన్లు వంటి వాటిని కూల్చడంలో ఇవి చాలా బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. అయితే వీటిని ఉపయోగించడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. లేజర్ బీమ్ నుంచి వచ్చే ఎనర్జీ, కూలింగ్ వ్యవస్థలు, మేఘాలు, వర్షం లాంటివన్నీ వీటి పనితీరుపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. లేజర్ ఆయుధాలు రష్యా నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. నిజానికి ఇప్పటికే ఇలాంటి లేజర్ ఆయుధాలు కేవలం మూడు దేశాల దగ్గరే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, చైనా మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నాయి. ఇక బ్రిటన్ కూడా దీనిపై ఇప్పటికే రీసెర్చ్ చేస్తోంది. మరి ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఉక్రెయిన్ చేరిందా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.