24 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

లక్ష కోట్ల టార్గెట్

  • దావోస్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు.
  • భారీ పెట్టుబడులే లక్ష్యంగా సమావేశాలు.
  • గత ఏడాది దావోస్ లో 40 వేల కోట్ల పెట్టుబడులకు హామీలు
  • ఈసారి టార్గెట్ లక్ష కోట్లు అంటున్న తెలంగాణ ప్రభుత్వం
  • ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు.
  • సింగపూర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అంటున్నా ప్రభుత్వ వర్గాలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్​లోని  జ్యురిచ్​కు చేరుకుంది.    దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి బృందానికి జ్యురిచ్ ఎయిర్ పోర్ట్ లో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు.

సీఎం రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. మరోవైపు దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సారధ్యంలోని ప్రతినిధి బృందం కూడా అదే సమయంలో అక్కడికి చేరుకుంది. జ్యురిచ్ ఎయిర్ పోర్టులో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులందరూ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల బృందాలు ఫొటోలు దిగారు.

దావోస్ సదస్సు లో పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు సమావేశమవుతారు. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా 40 వేల కోట్లకు పైగా పెట్టుబడి వచ్చాయని ఈసారి టార్గెట్ లక్ష కోట్లుగా పెట్టుకున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఒప్పందరికే పరిమితం కాకుండా అవి గ్రౌండ్ అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు అంటున్నారు.

దావోస్ పర్యటనకు ముందు సింగపూర్లో మూడు రోజులపాటు జరిగిన పర్యటన కూడా సక్సెస్ అయిందని అధికారులు తెలిపారు. ఆశించిన పెట్టుబడుల ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఐటీఈ)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవటం కీలక పరిణామం అని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. అదేవిధంగా.. సింగపూర్ పర్యటనలో ఒప్పందాలు పెట్టుబడుల విషయానికొస్తే.

హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.450 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేయనుంది.  రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్‌ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో చర్చలు జరిగాయి. మొత్తానికి ఈసారి దావోస్ పర్యటన రాష్ట్రానికి అన్ని విధాలుగా మేలు చేకూర్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com