- తిరువూరు ప్రజలనడిగితే తెలుస్తుంది… ఎమ్మెల్యే కొలికపూడి
- కొలికపూడి పార్టీ లైన్ దాటుతున్నారు- వర్ల
మీడియాలో వచ్చిన కధనాల ఆధారంగా నేను తప్పు చేసినట్లు మా పార్టీ అధిష్టానం భావించింది.. అందుకే క్రమశిక్షణ సంఘం ముందు హాజరై వివరణ ఇవ్వమని నన్ను ఆదేశించిందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. సోమవారం మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో క్రమశిక్షణ సంఘం ముందు హాజరై తాను చెప్పాల్సింది చెప్పానని కొలికపూడి స్పష్టం చేశారు. వాస్తవానికి ఈనెల 11వ తేదీన మా పార్టీ కార్యకర్త ఒకరు మృతి చెందితే పరామర్శ కోసం గోపాలపురం గ్రామం వెళ్ళానని అక్కడ వైసీపీ చెందిన వాళ్లు రోడ్డుపై ముళ్ళ కంచె అండ్డంగా వేస్తే దాని తొలగించానని, దాన్ని తొలగించినందుకే వైసీపీ కుటుంబానికి చెందిన వాళ్ళు నన్ను టార్గెట్ చేశారని కొలికపూడి వివరించారు. అదే వైసీపీ కుటుండం 2013లో చంద్రబాబుపై నీళ్ళ బాటిల్ విసిరారని అలాగే మజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ వాహనాలపై దాడి చేసి పగలగొట్టింది కూడా ఇదే కుటుంబమని తాను క్రమశిక్షణా సంఘానికి వివరించినట్లు కొలికపూడి మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో ఒక రకంగా వస్తుంది అక్కడ జరిగిన వాస్తవం వేరు, వాస్తవాలు ఏంటనేది తిరువూరు ప్రజలు అడిగితే తెలుస్తుంది, ఇదే విషయాన్ని క్రమశిక్షణ సంఘం సభ్యులకు రాతపూర్వకంగానూ నేరుగాను కలిసి చెప్పానన్నారు. క్రమిశిక్షణా సంఘం సభ్యులు కొనకళ్ళనారాయణ, వర్ల రమాయ్యలు మాట్లాడుతూ ఈ వివాదంలో నా ప్రమేయం ఏమీ లేదని కొలికపూడి శ్రీనివాస్ చెప్పారని, ఎమ్మెల్యే చెప్పిన వివరాలన్నీ హైకమాండ్‌కి పంపిస్తామని అన్నారు. టీడీపీలో ఎవరైనా క్రమశిక్షణ పాటించాల్సందే అని తిరువూరు ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటుతున్నట్లు తెలుస్తోందని వర్ల రామయ్య అన్నారు. ఈ ఏడు నెలల్లో రెండు ఘటనల్లో తిరువూరు ఎమ్మెల్యే రెండు సార్లు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు అయ్యారని త్వరలో చంద్రబాబు కి కొలికపూడి వ్యవహారంపై రిపోర్ట్ అందచేస్తామని వర్ల తెలిపారు.