ప్రఖ్యాత యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈనెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు మహాకుంభాభిషేకం జరగనుంది. ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో దేవాదాయ శాఖ కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయంలో జరిగే పనులు, ఏర్పాట్లకు సంబంధించిన పురోగగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులను స్వామివారి దర్శనానికి ఎక్కడి వరకు అనుమతించాలి, మహా కుంభాభిషేకం సమయంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఎండోమెంట్ కమిషనర్ పలు సూచనలు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశం నలుమూలల నుంచి కూడా ఈ ఉత్సవాలకు భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కొండపైకి వచ్చే వాహనాలను నియంత్రించడంపైనా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో ఈ సమీక్షలో చర్చించారు. వీలైనంత తొందరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున స్థానిక అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.