- ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి.
- మరోసారి అధికారుల పనితీరుపై బహిరంగంగా కామెంట్స్ చేసిన సీఎం
- ప్రభుత్వం మారిన అధికారులు మారడం లేదంటున్న మంత్రులు.
- మొన్న కలెక్టర్ల సమావేశం నిన్న పుస్తకావిష్కరణలో సీఎం హాట్ కామెంట్స్.
- సీఎం చెప్పిన స్పందించని అధికారులు.
- చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుకొని కలెక్టర్ల వరకు కమ్యూనికేషన్ గ్యాప్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి చేస్తున్న కామెంట్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారుల్లో కొందరు సీరియస్ గా పని చేయడం లేదని గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి మరోసారి అధికారుల పనితీరును తప్పుపట్టారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అధికారులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.. ఎక్కడో కొంత గ్యాప్ ఉందన్నది వాళ్ళ అభిప్రాయం. చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుకొని కలెక్టర్లు సెక్రెటరీల వరకు కొంత గ్యాప్ ఉందని ప్రభుత్వ వర్గాల సైతం అంగీకరిస్తున్నాయి.
ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే దాన్ని వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సీఎం చెప్పిన పనులను సైతం వీళ్లు ఆచరించడం లేదనీ మంత్రుల సైతం అంగీకరిస్తున్నారు. గతంలో హాస్టల్ లో పనితీరుపై సమీక్ష చేసిన రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలు రాత్రిపూట హాస్టల్ లో నిద్ర చేసి అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించినప్పటికీ చాలామంది కలెక్టర్లు వెళ్లలేదని ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి తెలిపారు. సివిల్ సర్వెంట్లు ఫీల్డ్ లో ఉండకుండా కేవలం ఆఫీసులకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ అవకాశం లభించినా అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. గతంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేసేవారని వారి నుంచి ఫీడ్ బ్యాక్ కూడా అంత అద్భుతంగా వచ్చేదని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని కొందరు మంత్రులు సైతం అంగీకరిస్తున్నారు.
గతంబిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన స్టైల్ లోనే ఇప్పటికీ కొంతమంది అధికారులు కొత్త ప్రభుత్వం వచ్చి 14 నెలలు కావస్తున్నా అదే పద్ధతిలో పనిచేస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. తమ శాఖకు సంబంధించిన సెక్రటరీలు కూడా వెంటనే స్పందించడం లేదని ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. పాలన పరంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న దానిని అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం అధికారుల పైనే ఉంటుంది. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా దాంట్లో అధికారుల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వంలో కొందరు ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పనితీరు ఏ మాత్రం బాగోలేదని విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగానే రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు