27.3 C
Hyderabad
Tuesday, September 22, 2026

Live Video

spot_img

కౌన్ బనేగా ఢిల్లీ సీఎం? ప్రమాణస్వీకారం ఆ రోజే..

హస్తిన పిఠాన్ని ఆధిరోహించే నేత ఎవరన్న సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. అయితే ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేసేందుకు రెడీ అవుతోంది బీజేపీ. ఫిబ్రవరి 19న ఢిల్లీ సీఎం ఎవరన్నది తేల్చేందుకు రెడీ అయిపోయింది కమలం పార్టీ. అంతేకాదు ఆ తర్వాతి రోజు అంటే 20న ఢిల్లీ సీఎంగా ఎంపికైన వ్యక్తి ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీ సీఎం, మంత్రివర్గంలో ఎవరుండాలనే విషయంపై ఇప్పటికే కొంత మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 15 మంది పేర్లు ఇప్పటికే షార్ట్ లిస్ట్ అయ్యారు. వీరిలో నుంచి ఒకరిని సీఎంగా.. మరో 9 మందిని కేబినెట్ మంత్రులుగా, స్పీకర్‌గా ఎంపిక చేయనుంది బీజేపీ అధిష్టానం. ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం 48 సీట్లను గెలుచుకుంది బీజేపీ. ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది.

ఢిల్లీకి సీఎం అయ్యేవారి లిస్ట్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పర్వేశ్ వర్మ. ఈ వర్మ ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించారు. రేఖా గుప్తా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. దివంగత సుష్మా స్వరాజ్‌ కుమార్తె బన్సూరి స్వరాజ్‌, స్మృతి ఇరానీ పేర్లు కూడా రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే నిర్ణయం తీసుకోవడంలో తొందరడపడటం లేదు బీజేపీ. ఎందుకంటే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో గెలిచింది బీజేపీ.

1993లో జరిగిన ఢిల్లీ తొలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. కానీ ఐదేళ్ల పాలనలో ఏకంగా ముగ్గురు సీఎంలను మార్చింది. దీంతో ఈసారి కాస్త ఆలస్యమైనా సమర్థవంతమైన నేతనే నియమించాలని చూస్తోంది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేయడంలో బీజేపీ ఎక్స్‌పర్ట్‌గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే మధ్యప్రదేశ్‌కు మోహన్‌ యాదవ్‌, రాజస్థాన్‌కు భజన్‌ లాల్‌ శర్మ, ఛత్తీస్‌గఢ్‌కు విష్ణుదేవ్ సాయ్‌లను సీఎంగా ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. రాజస్థాన్‌ విషయంలో అయితే ఏకంగా తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన భజన్‌ లాల్‌కు సీఎం పగ్గాలు అప్పగించింది. అందుకే ఢిల్లీ విషయంలో కూడా ఇలాంటి సర్‌ప్రైజింగ్ నిర్ణయమే ఉండే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com