32 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ఆ రెడ్డి కాదు… ఈ రెడ్డి…

  • ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు
  • జీవన్ రెడ్డి అవుట్ వేం నరేందర్ రెడ్డి ఇన్
  • అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి  ఓడిపోయిన వారికి నో ఛాన్స్
  • ఈసారికి సీపీఐ కి అవకాశం లేదన్న కాంగ్రెస్
  • నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే
  • ఐదో అభ్యర్థిపై మొదట చర్చించినా… తర్వాత వద్దనుకున్న కాంగ్రెస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ఎవరన్న అంశంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాబలాల ఆధారంగా ఐదు స్థానాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు బిఆర్ఎస్ కి ఒక ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఆ అవకాశం లభిస్తుంది అనే అంశంపై చర్చ జరుగుతోంది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సిపిఐ కి ఒక స్థానం కేటాయించాలన్న డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. సిపిఐ నేతలు కూడా ఈ విషయంపై రేవంత్ రెడ్డితో చర్చలు కూడా జరిపారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సిపిఐ కి ఒక సీటు ఇవ్వడం సాధ్యం కాదని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ పార్టీ వర్గాలకు స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని నాదిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లారని… వేరే పార్టీకి ఈసారి కాంగ్రెస్ కోటాలో అవకాశం లేదని పార్టీ నేతలు కూడా చెపుతున్నారు.

ఇక ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న నేతల విషయానికొస్తే ఎమ్మెల్యే కోటాలో జీవన్ రెడ్డికి ఈసారి కచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశాలు లభిస్తుందని మొదట ప్రచారం జరిగింది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించవద్దని అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. ఈ నిబంధనతో జీవన్ రెడ్డికి ఈసారి అవకాశం దక్కే పరిస్ధితి కనిపించడం లేదు. ఇదే నిబంధంన మైనార్టీ కోటలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న షబ్బీర్ అలీ కూడా వర్తిస్తుందని పార్టీ వర్గాలు చెపుతున్నా. ఎటువంటి మినహాయింపులూ లేకపోతే ఇక జీవన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీలు ఇద్దరు ఎమ్మెల్సీ రేసు నుంచి బయటపడినట్లే అంటున్నాయి పార్టీ వర్గాలు.

తాజా పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికే సంబంధించిన మరో నేతకు అవకాశం కల్పించనున్నట్లుగా తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దాదాపు ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి. జీవన్ రెడ్డి రేస్ లో నుంచి తప్పుకోవాల్సిన పరిస్ధితులు తలెత్తడంతో వేం నరేందర్‌ రెడ్డికి మార్గం క్లియర్ అయింది.

ఒక రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఒక ఎస్సి, ఒక ఎస్ టి కి అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఎస్సి కోటాలో అద్దంకి దయాకర్, ఎస్టి కోటాలో బెల్లయ్య నాయక్ లు ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. దయాకర్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస త్యాగాలు చేసుకుంటూ వస్తున్నాడు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిని చూడాలనే నిశ్చిత అభిప్రాయంతో రేవంత్‌కు ఎక్కడ తన వల్ల ఇబ్బంది ఎదురవుతుందో అన్న ఆలోచనతో దయాకర్ ప్రతి సందర్భంలో కాంప్రమైజ్‌ అవుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సారి దయాకర్‌కుఎమ్మెల్సీ పదవి ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టుబట్టే అవకాశం ఉందంటున్నారు. అదే విధంగా బెల్లయ్య నాయక్‌ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సీటును త్యాగం చేసి పార్టీ విజయం కోసం కృషి చేశారు. దీంతో ఈ సారి వీరిద్దరికీ ఎమ్మెల్సీ పదవులు ఖాయమంటున్నారు. ఇక నాలుగొవ స్ధానాన్ని మైనార్టీ కి కేటాయించాలని భావిస్తున్నప్పటికీ సరైన నాయకుడు కోసం అన్వేషిస్తున్నారు. ఇదే సమయంలో బీసీ వర్గానికి ఇచ్చి తీరాలని, ఓ పక్క బీసీ కుల గణన నిర్వహించి ఇప్పుడు తప్పకుండా కైవశం చేసుకునే అవకాశం ఉన్న నాలుగు ఎమ్మెల్సీల్లో ఒక్కటైనా బీసీలకు ఇవ్వాల్సిందే అనే డిమాండ్‌ కూడా తెరపైకి వస్తోంది. మైనార్టీ అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టి బీసీని నాలుగో స్ధానానికి ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే ఈరావత్‌ అనిల్‌ పేరు దాదాపు ఖరారు కావచ్చు. ఇక మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కూడా తనకు ఎమ్మెల్సీ ఇచ్చి తీరాలని పట్టుబడుతున్నారు. అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసి అధిష్టానం అనుమతితో ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

అయితే ఎంఐఎం కూడా మొదట ఒక సీటు అడగాలని భావించినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థన మేరకు ఈసారి బరిలో ఉండడం లేదు. భవిష్యత్తులో ఎంఐఎం తో పాటు సిపిఐ కి అవకాశం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చినట్లుగా తెలిసింది.

మరోవైపు ఐదు స్థానాల్లో పోటీ చేయాలన్న అంశం కూడా మొదట చర్చకు వచ్చినప్పటికీ ఆ ప్రతిపాదనకు అధిష్టానం అంగీకరించలేదని సమాచారం. సిపిఐ, ఎంఐఎం మద్దతుతో రెండో ప్రాధాన్యత ఓట్లు సహాయంతో ఐదో స్థానం దక్కించుకోవాలని తొలుత కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన చేసింది. అయితే బిఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ విషయంలో అధిష్టానం కొంత అభ్యంతరం చెప్పినట్టుగా తెలిసింది. ఇప్పటికే కోర్టు వివాదాల్లో పదిమంది ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే తమకు ఇబ్బంది వస్తుంది కనుక ఐదో అభ్యర్థి వద్దని వాళ్లు కూడా సూచించినట్టుగా తెలిసింది. దీని కారణంగానే కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుంది…. మిగతా ఒక స్థానంలో బి ఆర్ ఎస్ అభ్యర్థిని బర్లోకి దింపుతుంది. ఇదే జరిగితే ఐదు స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com