- సీయం 6, డిప్యూటీ సీయం 10, లోకేష్ 8వ స్థానం
- మంత్రుల పనితీరును వివరించిన సీఎం చంద్రబాబు
- డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు
- పైళ్లను వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్‌ల్లో వేగంగా ఫైళ్ళను క్లియర్ చేస్తున్న మంత్రులు ఎవరు, ఎవరు జాప్యం చేస్తున్నారన్న అంశంపై గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫైళ్ళ క్లియరెన్స్‌పై మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. విశేషం ఏమిటంటే ఈ ర్యాంకుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ఆరొవ స్ధానం ఇచ్చుకున్నారు. అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి పదొవ స్ధానం ఇవ్వగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు వేగంగా ఫైళ్ళు క్లియర్ చేస్తున్న మంత్రుల్లో ఎనిమిదో స్ధానం దక్కింద. ఇక మొదటి స్ధానంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ నిలవగా రెండో స్ధానంలో కందుల దర్గేశ్, మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, ఆరో స్థానంలో సీఎం చంద్రబాబు, ఏడో స్థానంలో సత్యకుమార్ యాదవ్, 8వ స్థానంలో నారా లోకేశ్, 9వ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి, 10వ స్థానంలో పవన్ కల్యాణ్, 11వ స్థానంలో సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర, 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్, 16వ స్థానంలో ఆనం రాంనారాయణరెడ్డి, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు, 18వ స్థానంలో రాంప్రసాదొడ్డి, 19వ స్థానంలో గుమ్మడి సంధ్యారాణి, 20వ స్థానంలో వంగలపూడి అనిత, 21వ స్థానంలో అనగాని సత్యప్రసాద్, 22వ స్థానంలో నిమ్మల రామానాయుడు, 23వ స్థానంలో కొలుసు పార్థసారథి, 24వ స్థానంలో పయ్యావుల కేశవ్, 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్‌లు ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గడచిన డిసెంబర్ మాసం వరకూ ఫైళ్ళు వేగంగా క్లియర్ చేసిన మంత్రులకు ఆ విధంగా ఇచ్చారు చంద్రబాబు. ఇకపై ఫైళ్ళ క్లియరెన్స్‌లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు.