తిరుమల ఘాట్‌రోడ్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనార్థం వెళ్తున్న భక్తులతో కూడిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు దిగి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం దెబ్బతిన్నది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. వినాయకుడి ఆలయ సమీపంలో కారు కొండను ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో కారులో ఉన్న భక్తులు మాత్రం చిన్న పాటి గాయాలతో భయట పడ్డారు. కారు కుడివైపు వెళ్లి కొండను ఢీకొట్టింది. అదే ఎడమవైపునకు వెళ్లి లోయలో పడితే ఊహించని ఘోరం జరిగి ఉండేది.