ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆంధ్రకు చెందిన కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రూ. 25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఆ మొత్తాన్ని త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేయనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు వెల్లడించారు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో నితీశ్ కుమార్‌రెడ్డి అద్భుతంగా రాణిస్తుండటం అభినందనీయం అని వారు పేర్కొన్నారు. నేటి యువతకు నితీశ్ కుమార్‌రెడ్డి రోల్ మోడల్ అన్నారు. నితీశ్ కుమార్‌రెడ్డి భవిష్యత్తులో మరిన్ని పరుగులు సాధించి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు.